Vijayashanti: రీ ఎంట్రీ తర్వాత కూడా సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanti) భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నారా..?

Share

Vijayashanti: విజయశాంతి (Vijayashanti) అంటే అందరికీ ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Bala krishna), నాగార్జున(Nagarjuna), వెంకటేశ్(Venkatesh) లాంటి అగ్ర హీరోల సరసన నటించింది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించిన ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అప్పటి హీరోయిన్స్ సుహాసిని, రాధ, రాధిక, సుమలత లాంటి హీరోయిన్స్‌తో పోటీ నటించిన విజయశాంతి (Vijayashanti) అందరికంటే అగ్ర స్థానంలో నిలుచున్నారు. విజయశాంతి(Vijayashanti) ని ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేశారు.

is senior heroine Vijayashanthi demanding for high remuniration....?
is senior heroine Vijayashanthi demanding for high remuniration….?

అయితే ఆమె ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణల(Bala krishna)తో నటించడం విశేషం. ముఖ్యంగా అప్పట్లో డాన్స్ పరంగా చిరంజీవి (Chiranjeevi)తో సమానంగా డాన్స్ చేయగల హీరోయిన్ అంటే అందరూ విజయశాంతి(Vijayashanti) గురించే చెప్పుకునేవారు. ఇక విజయశాంతి (Vijayashanti) చిరుతో నటించినా, బాలయ్య(Bala krishna)తో నటించినా ఎక్కువగా హిట్స్ వారి ఖాతాలో ఉన్నాయి. కృష్ణ, వెంకటేశ(Venkatesh), నాగార్జునలతో చేసిన సినిమాలు కూడా చాలా వరకు హిట్ సినిమాలే. ఆమె ఏ హీరో సరసన నటించినా హిట్ పెయిర్‌గా చెప్పుకునే వారు. ఒకవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే కర్తవ్యం లాంటి సినిమాలలో సోలో హీరోయిన్‌గా నటించి లేడీ అమితాబ్ బచ్చన్ అనే పేరు తెచ్చుకున్నారు.

Vijayashanti: విజయశాంతి(Vijayashanti) ససేమిరా అని వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించారు.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), తో కలిసి విజయశాంతి(Vijayashanti) దాదాపు 20 సినిమాలు చేశారు. ఛాలెంజ్, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్స్ వీరి కాంబినేషన్‌లో వచ్చి యావత్ దేశ సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. అలాగే బాలకృష్ణ(Bala krishna) మువ్వ గోపాలుడు, లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. నాగార్జున(Nagarjuna) జానకి రాముడు, వెంకటేశ్‌(Venkatesh) తో నటించిన శత్రువు, చినరాయుడు లాంటి కమర్షియల్ సినిమాలు ఆమె ఖాతలో హిట్స్‌గా నిలిచాయి.

ఇక ప్రతిఘటన, కర్తవ్యం, రేపటి పౌరులు, ఒసేయ్ రాములమ్మ లాంటి కథా బలమున్న సినిమాలు విజయశాంతి(Vijayashanti) కెరీర్‌ను అగ్ర స్థానంలో నిలుచోబెట్టాయి. ఇంత స్టార్ డం సంపాదించుకున్న ఆమె రాజకీయాలలోకి ప్రవేశించాకా పూర్తిగా సినిమాలకి దూరమయ్యారు. దాదాపు ఆమె తెర మీద కనిపించి 13 ఏళ్ళు దాటింది. ఈ మధ్యలో ఎందరో ఆమెను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలని చాలా ప్రయత్నించారు. కానీ ఆమె ససేమిరా అని వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించారు. అయితే పటాస్ సినిమా నుంచి వరుస హిట్స్ తో టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మాత్రం విజయశాంతి రీ ఎంట్రీ కోసం గట్టిగా ట్రై చేశాడు.

Vijayashanti: రీ ఎంట్రీ ఇచ్చిన ఇవరూ ఎలాంటి డిమాండ్స్ పెట్టడం లేదు.

రాజా ది గ్రేట్ సినిమాలో రాధిక పోషించిన పాత్రలో విజయశాంతి(Vijayashanti) ని నటింప చేయాలనుకున్నాడు. కానీ కుదరలేదు. అయినా సరే వదలకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు
నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ప్రత్యేకమైన పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. ఈ సినిమాకి ఆమె రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ అయింది. ఈ కారణంగానే ఆమె వరుసగా సినిమాలు చేస్తుందని అందరూ భావిస్తే నో అంటున్నారట. కథ..అందులో ఆమె పాత్ర పక్కాగా నచ్చాలి. దానికి తగ్గట్టే భారీ రెమ్యునరేషన్ ఇవ్వాలి. ఇవి కుదరకపోతే నో అని ఆన్సర్ ఇస్తున్నారట. రీ ఎంట్రీ ఇచ్చిన ఎవరూ ఇలాంటి డిమాండ్స్ పెట్టడం లేదు. అందుకే విజయశాంతి(Vijayashanti) ని తీసుకోవాలంటే ఆలోచిస్తున్నారట.


Share

Related posts

నెలకు రూ.2 వేలు కడితే రూ.లక్ష లోన్.. ఎలా అంటే?

Teja

కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

somaraju sharma

ముహూర్తం కుదిరింది

Siva Prasad