Shalini Pandey: కోలీవుడ్ మేకర్స్‌కి చుక్కలు చూపించి ముంబై చెక్కేసిన శాలినీ పాండే..!

Share

Shalini Pandey: ఒక్క సినిమాలో అవకాశం వచ్చేంతవరకే హీరోయిన్స్ ఎవరైనా కాస్త అణుకువగా ఉంటారు. ఆ అవకాశం రావడానికి ఎంత డీసెంట్‌గా ఉన్నట్టో కనిపిస్తారు. ఒక సినిమా అవకాశం వచ్చి అది సూపర్ హిట్ అయి ఇండస్ట్రీలో ఆమెని పొగిడితే గనక ఇక మోనార్క్‌లా మారిపోతారు. ఎవరి మాట వినరు. రెండవ సినిమా నుంచే రెమ్యునరేషన్ డిమాండ్, డేట్స్ లేవంటూ బిల్డప్పులు, మేనేజర్స్‌తో ప్రొటో కాల్స్ ..ఇలా నానా హంగామా చేస్తుంటారు. రెండవ సినిమా అవకాశం కూడా వచ్చి అది కూడా సూపర్ హిట్ అయితే ఎక్కడో ఎక్కి కూర్చుంటారు. నిర్మాతలు అడ్వాన్స్ ఇస్తామంటే వాళ్ళు చెప్పే డైలాగులు విని దిమ్మ తిరగాల్సిందే.

is shalilni pandey troubles kollywood makers
is shalilni pandey troubles kollywood makers

అలా కోలీవుడ్ దర్శక, నిర్మాతలకి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాపించి ఒప్పుకున్న సినిమాను మధ్యలోనే వదిలేసి ముంబై చెక్కేసింది అర్జున్ రెడ్డి ఫేమ్ శాలినీ పాండే. తెలుగులో శాలినీ పాండే మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆమెకి ఆశించినంతగా అవకాశాలు దక్కలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన 118, యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన ఇద్దరి లోకం ఒకటే వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత ఆమెకి అవకాశాలు దక్కలేదు. దాంతో కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఆఫర్ వస్తే వెళ్ళింది.

Shalini Pandey: ఇప్పట్లో తిరిగి సౌత్‌కి వచ్చే ఆలోచనలో శాలినీ పాండే లేదట.

అక్కడ ఆమె నటించే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమై చిత్రీకరణ సాగుతున్న సమయంలో అర్ధాంతరంగా సినిమా నుంచి తప్పుకుంది. కనీసం దర్శక నిర్మాతలను కూడా సంప్రదించకుండా, వారి అనుమతి తీసుకోకుండా ముంబై చెక్కేసింది. దాంతో చిత్ర నిర్మాతలు కోలీవుడ్ నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేశారు. ఆమె పై తీవ్రంగా ఆరోపణలు చేశారు. అయినా సినిమాను పూర్తి చేయకుండా తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చిందో లేదే గానీ ముంబైలో సెటిలైపోయింది. ఇప్పట్లో తిరిగి సౌత్‌కి వచ్చే ఆలోచనలో శాలినీ పాండే లేదట. ఇలా చేయడానికి కారణం ఆమెకు హిందీలో వరుసగా 4 సినిమా అవకాశాలు దక్కడమే.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్‌తో శాలినీ పాండే నాలుగు సినిమాలకి అగ్రిమెంట్ చేసిందట. ఈ నాలుగు సినిమాలు పూర్తయ్యే వరకు అటు హిందీలో గానీ ఇటు సౌత్ భాషలైన తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్రాలలో గానీ నటించ కూడదని కఠిన నిబందనలు ఉన్నాయట. అందుకే ఇప్పుడు శాలినీ పాండే కమిటయిన ఆ నాలుగు సినిమాలను పూర్తి చేయకుండా ముంబై నుంచి రానని సన్నిహిత వర్గాలతో చెబుతోందట. మరి హిందీలో ఆమె నిజంగా స్టార్ హీరోయిన్ అయితే పరవాలేదు. హై రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరీ సౌత్ మేకర్స్ అవకాశలివ్వడానికి చూస్తారు.

Shalini Pandey: శాలినీ పాండే మాత్రం పరిగెత్తుకుంటూ ముంబై వెళ్ళడం కొందరికి షాకింగ్‌గా అనిపిస్తోందట.

ఒకవేళ గతంలో పూజా హెగ్డేకి జరిగినట్టు గనక శాలినీ పాండే నటించిన సినిమాలు అంతగా ఆదరణకు నోచుకోకపోతే మాత్రం మళ్ళీ సౌత్ వైపు చూడాల్సిందే. అప్పుడు మనవాళ్ళు శాలినీ పాండేకి అవకాశాలు ఇస్తారా, అంత ఆలోచిస్తారా అంటే ఇప్పుడే చెప్పలేము. చెప్పాలంటే బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఇక్కడ అవకాశాలు దక్కుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటిది శాలినీ పాండే మాత్రం పరిగెత్తుకుంటూ ముంబై వెళ్ళడం కొందరికి షాకింగ్‌గా అనిపిస్తోందట. చూడాలి మరి ముందు ముందు శాలినీ పాండే కెరీర్ ఎలా సాగుతుందో.


Share

Related posts

వైకాపా రెబల్ ఎంపీ రాజు గారి వ్యవహారంపై స్పీకర్ స్పందన..! ఏ స్పీకర్ అనుకుంటున్నారు..?

somaraju sharma

భారీ కుట్రలు చేయబోతున్నది..! బీజేపీపై మంత్రి కెటిఆర్ తీవ్ర వ్యాఖ్యలు..!!

Special Bureau

MP RRR Case: సుప్రీం నుండి బెయిల్ లభించినా ఇంకా ఆర్మీ అసుపత్రిలోనే  రఘురామ కృష్ణం రాజు..! విడుదలకు మరో నాలుగు రోజులు ..! ఎందుకంటే..?

somaraju sharma