Shruti Haasan: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్‌లో శృతి హాసన్ ఒకరు. బాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ..తెలుగుతో పాటు, తమిళ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అయితే, ఉన్నట్టుం డి సినిమాలకు దూరమైంది శృతి హాసన్. తెలుగులో ఫ్లాప్స్ రాగానే ఇక్కడ అవకాశాలు ఎవరూ ఇవ్వలేదు. ఇక తమిళ ఇండస్ట్రీలోనూ అదే పరిస్థితి. దాంతో మూడేళ్ళపాటు సినిమాలలో కనిపించలేదు. ఈ గ్యాప్ కారణంగా ఇక శృతి హాసన్ ఇండస్ట్రీకి దూరమైం దనే చెప్పుకున్నారు. కానీ, అనూహ్యంగా మాస్ మహారాజ రవితేజ సరసన నటించిన క్రాక్ సినిమాతో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా సక్సెస్ మళ్ళీ శృతికి ఊపు తీసుకువచ్చింది. మూడేళ్ళ గ్యాప్ వచ్చిన విషయాన్ని కూడా జనాలు మర్చిపోయేంత భారీ సక్సెస్ అందుకుంది. ఇదే సమయంలో ఆమెకి గ్యాప్ రావడానికి కారణం ఏంటని అడిగితే..నేను కేవలం హీరోయిన్గా మాత్రమే కాదు..పలు విభాగాలలో పనిచేస్తున్నాను కాబట్టి ఒక్కో విభాగానికి అలా బ్రేక్ తీసుకుం టుంటా అంటూ కవర్ చేసింది. ఇక క్రాక్ తర్వాత తమిళంలో లాభం సినిమా చేసింది. ఈ కానీ, ఈ సినిమా అక్కడ శృతికి సక్సెస్ ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు తమిళం కాదు తెలుగు మాత్రమే అనే రేంజ్లో అమ్మడు వరుసగా సినిమాలను కమిటవుతోంది.
Shruti Haasan: చాలా రోజుల నుంచి ప్రచారం ..!
యంగ్ హీరోల సరసన కాకుండా సీనియర్ హీరోలకు శృతినే ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ప్రభాస్ సరసన సలార్ సినిమా చేస్తోంది శృతి. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోంది. ఇక మరోసారి గోపీచంద్ మలినేని దర్శతకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మెగా 154లో శృతి హీరోయిన్గా అవకాశం అందుకుంది. బాబీ దీనికి దర్శకుడు. చాలా రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్‌లో శృతి జాయిన్ అవుతుందని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆమెనే ఫైనల్ చేశారు మేకర్స్. దాంతో అందరూ శృతి ఏజ్ అయిన హీరోయిన్స్ లిస్ట్ వేసి కామెంట్స్ చేస్తున్నారట.