NewsOrbit
న్యూస్ సినిమా

Siddharth: ‘బొమ్మరిల్లు’తో భారీ హిట్ అందుకున్న సిద్దార్థ్ కెరీర్‌లో నాశనం అవడానికి కారణం ఆ రెండు సినిమాలేనా..?

Share

Siddharth: సిద్దార్థ్..హీరోగా, నిర్మాతగా, రచయితగా, సింగర్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. బాయ్స్ సినిమాతో తెలుగు, తమిళ సినిమాలలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు నిర్మించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోగా అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాకి హీరోగా ఎంచుకున్నప్పుడు అమ్మాయిలాగా ఉన్నాడు ఇతను హీరో ఏంటీ అని దర్శక నిర్మాతలను అందరూ కామెంట్ చేశారు. కానీ నిర్మాత ఎం.ఎస్.రాజు మాత్రం పూర్తి నమ్మకంతో సిద్దార్థ్‌నే హీరోగా పెట్టుకున్నాడు.

is-siddharth-career-spoiled-due-to-these-two-films
is siddharth career spoiled due to these two films

త్రిష హీరోయిన్‌గా నటించిన ఇందులో అర్చన, శ్రీ హరి కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజయ్యాక బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ అయింది సక్సెస్ అవడానికి. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో టాలీవుడ్‌లో సిద్దార్థ్ క్రేజీ హీరోగా మారాడు. ఈ సినిమా తర్వాత చుక్కల్లో చంద్రుడు అనే సినిమాలో నటించాడు సిద్దార్థ్. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. కానీ ఈ హీరోకి బాలీవుడ్‌లో అదిరిపోయే ఆఫర్ వచ్చింది.

Sidharth: సిద్దార్థ్ ఈ సినిమాకి పర్‌ఫెక్ట్, బెస్ట్ డెసిషన్ అని నమ్మకంగా చెప్పారట.

ఆ సినిమానే రంగ్ దే బసంతి. బాలీవుడ్‌లో ఈ సినిమాతో సిద్దార్థ్ బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. దాంతో అటు హింది సీమలో ఇటు సౌత్‌లో ఆయన క్రేజ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దిల్ రాజు నిర్మించిన బొమ్మరిల్లు సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. భాస్కర్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా సిద్దార్థ్‌ను అనుకున్నప్పుడు దిల్ రాజు, ఎం.ఎస్.రాజుతో మాట్లాడి కథ చెప్పాడు. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా సిద్దార్థ్ ఈ సినిమాకి పర్‌ఫెక్ట్, బెస్ట్ డెసిషన్ అని నమ్మకంగా చెప్పారట.

అదే నిజమైంది. బొమ్మరిల్లు సిద్దార్థ్‌గా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో నటించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి ఈ హీరోకి టాలీవుడ్‌లో అంతగా కలిసి రాలేదు. అందుకు కారణం ఆయన ఎంచుకున్న సినిమాలే. క్రేజ్ అండ్ ఫాపులారిటీ వచ్చింది కదా అని కథ గురించి అంతగా పట్టించుకోకుండా వచ్చిన కథలను ఫిల్టర్ చేసుకోకుండా ఓకే చెప్తూ వచ్చాడు. దాంతో సిద్దార్థ్ కెరీర్ డైలమాలో పడింది. అందుకు కారణం ఆయన నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి. ముఖ్యంగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఆట సిద్దార్థ్ కెరీర్ మొత్తాన్ని తలకిందులు చేసింది.

Siddharth: సిద్దార్థ్ ఆట, బావ సినిమాలు ఒప్పుకోవడం చేసిన పెద్ద పొరపాటు.

ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఆట అటు దర్శకుడు వి.ఎన్.ఆదిత్యకి ఇటూ హీరో, హీరోయిన్స్ సిద్దార్థ్ – ఇలియానాల కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా మిగిలింది. చెప్పాలంటే ఈ సినిమా దర్శకుడు ఆదిత్య కెరీర్‌ని గట్టి దెబ్బకొట్టింది. ఆ తర్వాత సిద్దార్థ్ నటించిన బావ, అనగనగా ఓ ధీరుడు, ఓయ్ సినిమాలు ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. ముఖ్యంగా సిద్దార్థ్ ఆట, బావ సినిమాలు ఒప్పుకోవడం చేసిన పెద్ద పొరపాటు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు సిద్దార్థ్ కెరీర్ ట్రాక్ ఎక్కనేలేదు. త్వరలో మహా సముద్రం సినిమాతో రాబోతున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుంటాడా లేదా. ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. అదిథి రావు హైదరి, అనూ ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.


Share

Related posts

Relationship ఈ విషయాలు తెలుసుకుంటే శృంగార సామ్రాజ్యం లో మీకు అపజయమే ఉండదు!!(పార్ట్-1)

Kumar

NTR: అభిమానులకు ఎమోషనల్ లెటర్ రాసిన ఎన్టీఆర్..!!

sekhar

Jeevach: కోరికలను తీర్చే అద్భుతమైన చెరువు.. అలా చేస్తే సంతాన ప్రాప్తి కూడా..!

bharani jella