NewsOrbit
న్యూస్ సినిమా

Tuck jagadish : ‘టక్ జగదీష్’ తో శివ నిర్వాణ మాత్రం హ్యాట్రిక్ కొట్టాలనే ఈ ప్రయత్నమా…?

nani tuck jagadish

Tuck jagadish : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. వి సినిమా ఓటీటీలో రిలీజై యావరేజ్ టాక్ వచ్చినప్పటికి నిర్మాత దిల్ రాజుకి మాత్రం ఎలాంటి నష్టం కలగకుండా దాదాపు 10 కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టాడు.ఏప్రిల్ 23న నాని నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ”టక్ జగదీష్” విడుదలకి సిద్దంగా ఉంది.ఇందులో రీతూ వర్మ – ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిన విషయమే. ఈ సినిమాని సూపర్ హిట్ మూవీస్ ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ ని అందించిన శివ నిర్వాణ తెరకెక్కించబోతున్నారు.

is-siva-nirvana-trying-to-get-hatric-hit-by-tuck-jagadish
is siva nirvana trying to get hatric hit by tuck jagadish

రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్,టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన ‘ఇంకోసారి’ పాట కి కూడా ప్రేక్షకాదరణ లభించింది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట ‘కోలో కోలన్న కోలో’ అనే సెకండ్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటకు థమన్ మ్యూజిక్ అందించగా ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ ని రాశారు. ‘కోలో కోలన్న కోలో.. కొమ్మలు కిలకిలా నవ్వాలి.. కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి’ అంటూ సాగే ఈ పాట మనసుకు ఎంతో హాయి గొలుపుతుందని భావిస్తున్నారు. ఈ పాటకు గాను ప్రాణం పోసేందుకు అర్మాన్ మాలిక్ – హరిణి – శ్రీకృష్ణ – థమన్ కలిసి వారి గాత్రాన్ని కలిపారు.అయితే ఈ పాటలో ఒక ప్రత్యేకత లేకపోలేదు.

Tuck jagadish : టక్ జగదీష్ ఫెస్టివల్ మూడ్ ని క్రియేట్ చేస్తుందా…?

అదేమిటంటే ఇందులో కుటుంబ విలువల గురించి అన్నదమ్ముల మధ్య అనుబంధం ఆప్యాయతలు గురించి చెప్పకనే చెప్పారు.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటునందుకు ఫ్యామిలీతో కలసి ఈ సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం దక్కుతుందని అందరు భావిస్తున్నారు. మొత్తం మీద టక్ జగదీష్ ఫెస్టివల్ మూడ్ ని క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సంశయమే లేదు అనే మాట వినిపిస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో జగపతి బాబు – నాజర్ – డేనియల్ బాలాజీ – ప్రియదర్శి – తిరువీర్ – రోహిణి – ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు.సమ్మర్ లో విడుదల కానున్న ఈ సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri