తన కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినా, సీరియల్ లలో తన సత్తా చాటినా మొన్నటివరకు సయ్యద్ సోహెల్ రియాన్ అనే పేరు చాలా మందికి తెలియదు. సోహెల్ కి పెద్ద హీరోల సినిమాలలో నటించే అవకాశం వచ్చినా వాటిలో సరైన గుర్తింపు రాలేదు. కానీ, స్టార్ మా లో ప్రసారమయిన బిగ్‌బాస్ రియాలిటీ షో నాలుగవ సీజన్ లో పాల్గొన్నాక మాత్రం ఇతడి పేరు విపరీతంగా ట్రెండ్ అయింది. హౌస్ లో తన ఆటిట్యూడ్ తో చివరికి రన్నరప్‌గా నిలిచినప్పటికీ, ఇతనికి ఎక్కడలేని స్టార్ డమ్ సొంతమయ్యింది. ప్రస్తుతం సోహెల్ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు. ఒక్క బిగ్ బాస్ షో అతడి లైఫ్ మొత్తాన్ని మార్చేసింది.
ఇటీవల సోహెల్ ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. యాంకర్, సోహెల్ ని డేటింగ్ ను బిగ్ బాస్ హౌస్ లో ఏ కంటెస్టెంట్‌తో చేస్తావంటూ ప్రశ్నించగా అతను దేత్తడి హారిక పేరు చెప్పాడు. అంతే కాకుండా, అలాగే ఏ కంటెస్టెంట్‌ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారని ప్రశ్నించగా సోహెల్ అరియానా గ్లోరీ పేరు చెప్పాడు. ఇక సోహెల్ వెల్లడించిన విషయాలపై నెటిజన్లు విపరీతంగా కామెంట్స్ మరియు మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతటితో ఊరుకోకుండా నెటిజన్లు ఆరియానాతో సోహెల్ కి పెళ్లి జరిగితే ఎలా ఉంటుందన్న దానిపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్లో కూడా అభిజీత్, అఖిల్‌తో కలిసి సోహెల్ టాప్-3లో నిలిచాడు. అయితే, తనకి బిగ్ బాస్ రూ.25 లక్షల ఆఫర్ ఇవ్వడంతో అందుకు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్. కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం దూసుకుపోతున్నాడు.