Janvi kapoor : సౌత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు నార్త్ అంటే బాలీవుడ్ సినిమా పరిశ్రమలో కూడా అతిలోక సుందరి అయిన అందాల తార అన్న క్రేజ్ తెచ్చుకున్న శ్రీదేవి కూతుళ్ళుగా స్టార్ స్టేటస్ అందుకోవాలని ఎంతో ఆరాటపడ్దారు..శ్రీదేవి, బోనీ కపూర్. ఆ ఆరాటం ఒక కూతురు జాన్వీ కపూర్ తో నెరవేరింది. అయితే అది కొంతవరకే. ధడక్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి పెద్ద నిర్మాత ..డేట్స్ వగైరా చూడటానికి మరో పెద్ద నిర్మాత కరణ్ జోహార్ గట్టి అండదండలు జాన్వీకి బాగానే ఉన్నాయి.
నెమ్మదిగా హిందీ చిత్ర సీమలో జాన్వీ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. కానీ తెలుగులో రెండేళ్ళుగా హీరోయిన్ గా వస్తుందని ప్రచారం మాత్రమే జరుగుతుంది. జాన్వీ తండ్రి బోనీకపూర్ ఇక్కడ కూతురు ఎంట్రీకి బాగానే ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలుగు లేదా తమిళ పరిశ్రమలలో జాన్వీని హీరోయిన్ గా దింపాలని చూస్తున్నాడట. అది కూడా పెద్ద హీరోల సినిమాలతో. వాళ్ళతో అయితే లాంచింగ్ ఫిల్మ్ కి మంచి క్రేజ్ ఉంటుందని ప్లాన్. సూపర్ స్టార్ మహేష్ గాని, జూనియర్ ఎన్.టి.ఆర్ గాని, అల్లు అర్జున్ గానీ, తమిళంలో విజయ్ లాంటి స్టార్స్ తో ఆలోచన చేస్తున్నారట.
Janvi kapoor : నార్త్ కంటే ముందు సౌత్ ఎంట్రీ అయితే ఖుషి కపూర్ కి బావుంటుందట.
అయితే రేస్ లోకి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా వచ్చింది. నార్త్ కంటే ముందు సౌత్ ఎంట్రీ అయితే ఖుషి కపూర్ కి బావుంటుందనే ప్లాన్ లో బోనీ ఉన్నారట. మరి అక్క చెల్లెల్లలో ఎవరు ముందు సౌత్ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా సక్సెస్ అవుతారన్నది కాలమే నిర్ణయించాలి. ఇటీవల పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ అనే చిత్రానికి ఒక నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. దాంతో మరికొన్ని సినిమాలు ఇక్కడ స్టార్ హీరోలతో నిర్మించేలా సన్నాహాలు కూడా బోనీ కపూర్ చేస్తున్నారు. దిల్ రాజు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ అవ్వాలని భావిస్తున్నాడు.