Nani : టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా నాని ఎంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. నాని పక్కింటి కుర్రాడు తరహా పాత్రను చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక నిర్మాతల హీరో అని నాని గురించి అందరూ మాట్లాడుకోవడం కూడా తెలిసిందే. ఏ నిర్మాత నానితో సినిమా తీసిన డబ్బు పోగొట్టున్న సందర్భాలు లేవనే చెప్పాలి. మినిమం గ్యారెంటీ హీరోగా నానికి పేరున్న నానికి యావరేజ్ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు.
ఇక నిర్మాతలు కూడా నానితో సినిమాలు నిర్మించడాని ఎప్పుడూ రెడీగానే ఉంటున్నారు. నాని కి కెరీర్ లో ఇప్పటి వరకు లాంగ్ గ్యాప్ వచ్చింది లేదు. కాగా గత చిత్రం వి కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయుంది. అయినా నాని చేతి నిండా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన టక్ జగదీష్ ఈ నెల 26న రిలీజ్ కాబోతోంది. అన్నదమ్ముల మధ్యన సాగే ఎమోషనల్ డ్రామాగా టక్ జగదీష్ తెరకెక్కగా జగపతి బాబు కీలక పాత్రలో నటించాడు. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు.
Nani : శ్యామ్ సింఘరాయ్ కథ మీద నమ్మకంతోనే బడ్జెట్ కేటాయిస్తున్నారట..!
కాగా నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింఘరాయ్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండగా వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి నాని మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సెట్స్‌లో జరుపుతున్నారట. దాంతో బడ్జెట్ బాగా పెరుగుతుందట. అయితే శ్యామ్ సింఘరాయ్ కథ మీద నమ్మకంతోనే బడ్జెట్ కేటాయిస్తున్నారని చెప్పుకుంటున్నారు.