Srikanth: ఇకపై శ్రీకాంత్ విలన్ పాత్రలే ఫిక్స్ అవుతాడు..యంగ్ హీరోలు కొట్టిన దెబ్బ అలాంటిది మరి

Share

Srikanth: ఒకప్పుడు శ్రీకాంత్ సినిమా అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా థియేటర్స్‌కి వెళ్ళేవారు. టాలీవుడ్‌లో త్వరగా 100 చిత్రాల మైలురాయిని చేరుకున్న హీరోలలో శ్రీకాంత్ ఒకరు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించిన ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’ అనే సినిమా శ్రీకాంత్ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు శ్రీకాంత్ అందుకున్న రెమ్యునరేషన్ రూ 5000/-. కెరీర్ ప్రారంభంలో శ్రీకాంత్ చాలా చిన్న చిన్న పాత్రలలో కనిపించాడు.

is-srikanth-fixing-himself-for-villan-roles
is-srikanth-fixing-himself-for-villan-roles

ఆ తర్వాత కొన్ని సినిమాలలో విలన్ గా చేసిన శ్రీకాంత్ మెల్లగా హీరో అవకాశాలను అందుకున్నాడు. 1993లో వచ్చిన వన్ బై టు హీరోగా శ్రీకాంత్ కి మొదటి సినిమా. ఈ సినిమాలో శ్రీకాంత్ నటనకు మంచి పేరు వచ్చింది. దాంతో తాజ్ మహల్ అనే సినిమాలో అవకాశం అందుకున్నాడు. 1995లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు టాలీవుడ్‌లో హీరోగా శ్రీకాంత్‌కి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎం.ఎం.శ్రీలేఖ అందించిన సంగీత కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ కావడంతో శ్రీకాంత్‌కి మంచి హిట్ దక్కింది.

Srikanth: ఆ కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్, ఆ మూవీ సీక్వెల్, శంకర్‌దాదా జిందాబాద్ లతో నెరవేరింది.

ఆ తర్వాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళి సందడి శ్రీకాంత్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 1996లో వచ్చిన పెళ్లి సందడి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్ఠించింది. ఆ తర్వాత నుంచి శ్రీకాంత్ ఫ్యామిలీ హీరో అయ్యాడు. ఆయన నటించిన సినిమాలన్నీ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా రూపొంది బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ సాధించాయి. భారీ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్న శ్రీకాంత్ అప్పటి క్రేజీ హీరోలైన జగపతి బాబు, నాగార్జున, నవీన్ వడ్డే, ప్రభుదేవా లాంటి వారితో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

ఇక క్రియేటి డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం, ప్రముఖ దర్శక, రచయిత పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ ధుర్యోధన లాంటి సినిమాల్లో శ్రీకాంత్ పోషించిన పాత్రలు అద్భుతంగా ఉన్నాయని సినీ ప్రముఖులు, విమర్శకులు ప్రశంసలు కురిపించాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో తాపత్రయపడేవాడు. ఆ కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్, ఆ మూవీ సీక్వెల్, శంకర్‌దాదా జిందాబాద్ లతో నెరవేరింది.

Srikanth: విలన్‌గా జగపతి బాబు రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంటాడాలేదా..?

అలాగే బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజ్యం సినిమా, వెంకటేష్ తో కలిసి సంక్రాంతి, జె.డి. చక్రవర్తితో ఎగిరే పావురమా, నాగార్జునతో కలిసి నిన్నే ప్రేమిస్తా, మోహన్ బాబుతో తప్పుచేసి పప్పుకూడు, రాజేంద్ర ప్రసాద్ తో సరదాగా సరదాగా వంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన గోవిందుడు అందరి వాడే లాంటి సినిమాలలో కీలక పాత్రలో నటించాడు. అయితే గత కొంతకాలంగా యంగ్ హీరోల తాకిడి ఎక్కువవడంతో శ్రీకాంత్‌కి హీరోగా అవకాశాలు కాస్త తగ్గాయి. హీరోగా మంచి హిట్ అందుకొని చాలా కాలం అయింది. దాంతో ఇప్పుడు అఖండ సినిమాతో విలన్‌గా మారాడు. ఇకపై విలన్ పాత్రల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తానని చెబుతున్నాడు. మరి విలన్‌గా జగపతి బాబు రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంటాడా లేదా చూడాలి.


Share

Related posts

ఐఐటీ చరిత్రలో ఓ విద్యార్థి రికార్డు..! కోటిన్నర వేతనంతో ఉద్యోగం..!!

Vissu

Corona Vaccine Good News: కరోనా వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

somaraju sharma

Subiksha Saree Photos

Gallery Desk