Sukumar : సుకుమార్ శిష్యుడు పుష్పకి పని చేస్తున్నాడా..?

Share

Sukumar : లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలు రూపొందుతున్న ఈ సినిమాను ముత్యం శెట్టి మీడియా..మైత్రీ మూవీ మేకర్స్ కలిసి 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పార్ట్ వన్ ఈ ఏడాది వచ్చే అవకాశాలున్నాయి. వాస్తవంగా ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా కారణంగా షూటింగ్ దశలో ఆగిపోయింది.

 

is sukumar-student working for pushpa
is sukumar-student working for pushpa

అయితే విజయదశమి లేదా దీపావళి పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో పుష్ప మొదటి భాగాన్ని తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కాగా రెండవ భాగాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయనుండగా దీనికి సంబంధించి కొన్ని బాధ్యతలను సుకుమార్ శిష్యుడు ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరిన బుచ్చిబాబు కి సుకుమార్ అప్పగించాడట.

Sukumar : సుకుమార్ పుష్ప కి సహాయకుడిగా బుచ్చిబాబు ఉన్నాడట..?

స్క్రిప్ట్ తో పాటు స్క్రీన్ ప్లే..షూటింగ్ తదితర కీలకమైన విభాగాలలో బుచ్చిబాబు సహకారం తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. బుచ్చిబాబు నెక్స్ట్ సినిమాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ కథలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లేదా అక్కినేని నాగ చైతన్య నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు కాస్త సమయం పడుతుండటంతో సుకుమార్ పుష్ప కి సహాయకుడిగా ఉన్నాడట.


Share

Related posts

Chithu Vj New Wallpapers

Gallery Desk

దీపిక కోసం వెయిట్‌ చేయలేడట… 

Siva Prasad

ఫేక్ వార్త‌ల‌కు చెక్ పెట్టనున్న ఫేస్‌బుక్‌.. కోవిడ్ కోసం ప్ర‌త్యేకంగా సెక్ష‌న్‌..

Srikanth A