Surabhi : సినిమా ఇండస్ట్రీ మీద ఎంతో నమ్మకం, ఆశ పెట్టుకొని ప్రతీ ఒక్కరు వస్తారు. ఇక్కడ ఏదో సాధించాలని స్టార్ స్టేటస్ దక్కించుకోవాలని కసి, తపనతో చేయాల్సిన అన్నీ ప్రయత్నాలు చేస్తారు. కానీ అదృష్టం ఎప్పుడు ఎవరికి అవకాశాలు వచ్చేలా చేస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఒక్క సినిమా జీవితాన్ని తలకిందులు చేస్తుంది. లేదా తారా స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెడుతుంది. ఇక్కడ ఒక సినిమాతో అడ్రస్ లేకుండా పోయినవాళ్ళున్నారు. పది సినిమాల తర్వాత కనిపడకుండా పోయిన వాళ్ళున్నారు.
వరుసగా భారీ హిట్స్ అందుకొని ఓ రెండు ఫ్లాపులు పడగానే అందరు పక్కన పెట్టేసినవాళ్ళు ఉన్నారు. 15 ఏళ్ళుగా ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఎన్ని సినిమాలు చేసినా స్టార్ స్టేటస్ అందుకోని వాళ్ళ లిస్ట్ లో సురభి కూడా చేరినట్టే అని ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. చెన్నై నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకొచ్చిన ఈమె ఇక్కడ సక్సెస్ కోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. కానీ ఆ ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. ముందు తమిళ సినిమాలలో నటించింది సురభి.
Surabhi : కెరీర్ డైలమాలో పడిందని చెప్పుకుంటున్నారు.
అక్కడ చేసిన సినిమాలు కాస్త పేరు తీసుకు రావడంతో తెలుగు మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. బీరువా సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. యావరేజ్ టాక్ వచ్చింది. అయినా అడపదడపా అవకాశాలు దక్కాయి. కానీ హిట్స్ అకౌంట్ లో చేరలేదు. నానితో జెంటిల్ మ్యాన్, శర్వానంద్ తో ఎక్స్ప్రెస్ రాజా చేసింది. ఆ సినిమాలు హిట్ అయినా ఆమెకి ఆ క్రెడిట్ దక్కలేదు. ఇటీవల శశి సినిమాతో వచ్చింది. ఒక్క పాట తప్ప సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఇప్పుడు అమ్మడి కెరీర్ డైలమాలో పడిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైతే కొత్త సినిమా అవకాశం లేదు.