Tamannah : తమన్నా భాటియా.. ఇండస్టీకొచ్చి దాదాపు 15ఏళ్ళు దాటుతోంది. ఎన్నో సూపర్ హిట్స్.. ఎన్నో బ్లాక్ బస్టర్స్ తన ఖాతలో వేసుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సినిమాలలో నటించిన తమన్నాకి మూడు భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తమన్నా నటించిన సినిమాలు ఫ్లాప్ గా మిగిలినవి చాలా తక్కువే అని చెప్పాలి. శ్రీ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తమన్నా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గురింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది.
చిన్న హీరోలతో నటించిన తమన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో కూడా నటించే అవకాశం అందుకుంది. వీరితో చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా తరగని అందంతో తళ తళ మెరుస్తూనే ఉంది. చెప్పాలంటే రోజు రోజుకి తమన్నా అందం పెరుగూతునే ఉంది తప్ప తరగడం లేదు. మిల్కీ బ్యూటీగా తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో యమా బిజీగా ఉంది. ఒక వైపు వెబ్ సిరీస్ కూడా చేయడం మొదలు పెట్టింది.
Tamannah : మరో 10ఏళ్ళు ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుందనిపిస్తోంది.
ప్రస్తుతం తమన్నా చేతిలో గోపీచంద్ తో నటించిన సీటీమార్ సినిమా..నితిన్ తో బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్..యంగ్ హీరో సత్య దేవ్ తో చేస్తున్న గుర్తుందా శీతాకాలం, వెంకటేష్ – వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ ఎఫ్ 3 లాంటి సినిమాలున్నాయి. దటీజ్ మహాలక్ష్మీ, సీటీమార్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇక 11త్ అవర్ అనే వెబ్ సిరీస్ కూడా పూర్తి చేసింది. తమన్నా మెరిసే అందాలను చూస్తుంటే ..ప్రస్తుతం తన క్రేజ్ ఇలానే కంటిన్యూ అయితే మరో 10 ఏళ్ళు ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుందనిపిస్తోంది.