Tarun: ఎన్నో సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్‌గా ఇండస్ట్రీలో వెలగాల్సిన తరుణ్ అందుకే అవకాశాలు దక్కించుకోలేపోతున్నాడా..?

Share

Tarun: చైల్డ్ ఆర్టిస్ట్‌గా అంజలి, దళపతి, సూర్య ఐపిఎస్, ఆదిత్య 369 లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ చిన్న వయసులోనే హీరోగా మారాడు. నువ్వే కావాలి సినిమాతో ప్రముఖ నిర్మాత రామోజీ రావు తరుణ్‌ని హీరోగా పరిచయం చేశారు. త్రివిక్రం శ్రీనివాస్ కథ మాటలు, విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మొదటి సినిమాకే హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న తరుణ్‌కి సురేశ్ ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలలో నటించే అవకాశాలను అందుకున్నాడు.

is-tarun-missing-the-chances-because-of-this
is-tarun-missing-the-chances-because-of-this

నువ్వే కావాలి సినిమా తర్వాత తరుణ్ అంకుల్ అనే సినిమా చేసి ఫ్లాప్ మూటకట్టుకున్నాడు. అయితే ఆ వెంటనే వచ్చిన ప్రియమైన నీకు సినిమాతో మళ్ళీ సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తన డెబ్యూ హీరోయిన్ రీచాతో కలిసి చిరుజల్లు అనే సినిమాలో నటించాడు. మొదటి సినిమాలో నటించిన తరుణ్ – రీచా కలిసి నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలతో బాక్సాఫీస్ వద్ద విడుదలై పరాజయాన్ని చూసింది. దాంతో తరుణ్ కాస్త అయోమయంలో పడ్డాడు. దాంతో కథలను చూసి చూసి ఎంచుకోవడం మొదలు పెట్టాడు. వాస్తవంగా తరుణ్ నటించిన సినిమాల కథలను వాళ్ళ అమ్మ, సీనియర్ నటీమణి రోజా రమణి ఫైనల్ చేసేవారు.

Tarun: తరుణ్‌కి ఎప్పుడు వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ దక్కలేదు.

అయినా కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. దానికితోడు ఉదయ్ కిరణ్ లాంటి యంగ్ హీరో కూడా గట్టి పోటీ ఇచ్చాడు. అయితే సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించిన నువ్వు లేక నేను లేను తరుణ్‌కి మంచి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత నటించిన అదృష్ఠం సినిమా పోయినా మళ్ళీ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకుడిగా మారుతూ రూపొందించిన నువ్వే నువ్వే సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను కూడా మంచి హిట్ సినిమాగా నిలిచింది. అయితే తరుణ్‌కి ఎప్పుడు వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ దక్కలేదు.

ఒక ఫ్లాప్ ఒక హిట్ అనేట్టుగానే కెరీర్ సాగింది. నిన్నే ఇష్టపడ్డాను తర్వాత నుంచి తరుణ్ ఆశించిన విజయాలు దక్కలేదనే చెప్పాలి. సోగ్గాడు, నీ మనసు నాకు తెలుసు, నవ వసంతం లాంటి సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరాయి. అదే సమయంలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇద్దరు ప్రేమించుకున్నారని అంతటా వార్తలు షికార్లు చేశాయి. ఒకవైపు తరుణ్ నటించిన సినిమాలు సక్సెస్ కాకపోతుండటం, మరొకవైపు హీరోయిన్‌తో పెళ్ళిపై వస్తున్న వార్తలు తన కెరీర్‌కి మేకుల్లా తయారయ్యాయి. దాంతో తరుణ్ సినిమాలు చేసే అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి.

Tarun: తరుణ్ సగం కెరీర్ నాశనం అయిందని చెప్పుకునే స్థాయికి వ్యవహారం వచ్చేసింది.

కెరీర్ ప్రారంభంలో వరుసగా వస్తున్న అవకాశాలను ఒప్పుకోలేక రిజెక్ట్ చేసిన తరుణ్ చివరికి ఏదో ఒక సినిమా చేసి హిట్ అందుకొని మళ్ళీ ఫాంలోకి రావాలనే ఆరాటంతో ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ హీరోయిన్ ప్రేమ విషయమే తరుణ్‌ని తీవ్రంగా వెంటాడింది. ఈ విషయంలోనే తరుణ్ సగం కెరీర్ నాశనం అయిందని చెప్పుకునే స్థాయికి వ్యవహారం వచ్చేసింది. కుదురుగా వచ్చిన స్టార్ డం ని కాపాడుకుంటూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు తరుణ్ కెరీర్ మరోలా ఉండేది.


Share

Related posts

Rachita Mahalakshmi Latest Gallerys

Gallery Desk

Anjana Rangan Latest Wallpapers

Gallery Desk

ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలా చేస్తే డెలివరీ తర్వాత ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. (పార్ట్-2)

Kumar