Teja : తేజ .. దర్శకుడిగా టాలీవుడ్ లో ఒక సెన్షేషన్ ని క్రియేట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ గా బాలీవుడ్ సినిమాలకి పని చేసిన తేజ తెలుగులో చిత్రం అన్న సినిమాతో దర్శకుడిగా మారాడు. రామోజీ రావు నిర్మించిన ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరో హీరోయిన్స్ గా ఉదయ్ కిరణ్, రీమా సేన్ లను పరిచయం చేశాడు. ఈ సినిమా ద్వారా అందరు కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకు వచ్చి లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు నేను, జయం, ధైర్యం, నిజం ఇలా వరసగా సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీకీ ప్రతీ సినిమాతో కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ వచ్చాడు.
నితిన్, సదా, కాజల్ అగర్వాల్, నవదీప్ ఇలా ఎంతో మందిని ఇండస్ట్రీకి తీసుకు వచ్చి స్టార్స్ గా చేశాడు. ఆ తర్వాత కళ్యాణ్ రాం, రానా లాంటి హీరోలతో సినిమాలు చేశాడు. ప్రస్తుతం గోపీచంద్, రానా లతో సినిమాలు ప్లాన్ చేసుకున్న తేజ అందరు కొత్త వాళ్ళతో మరొక సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా తేజ డెబ్యూ సినిమా అయిన చిత్రం కి సీక్వెల్ గా రూపొందనుండటం విశేషం. ఈ సినిమా ద్వారా దాదాపు 45 మందిని తెలుగు తెరకి పరిచయం చేయబోతున్నాడు.
Teja : తేజది డెబ్యూ హీరోలకి లక్కీ హ్యాండ్ ..!
కాగా ఈ సినిమాతో దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన కుర్రాడిని హీరోగా పరిచయం చేయబోతున్నాడని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన చిత్రం సీక్వెల్.. ‘చిత్రం 1.1’ సినిమాలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు దగ్గుబాటి అభిరాం ని హీరోగా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది. వాస్తవంగా అభిరాం ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ కరెక్ట్ ప్రాజెక్ట్ సెట్ అవక ఇంతకాలం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకి తేజ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని అంటున్నారు. ఇక డెబ్యూ హీరోలకి తేజది లక్కీ హ్యాండ్ అని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.