Thaman: ప్రస్తుతం సౌత్‌లో మ్యూజిక్ సెన్షేషన్‌గా సత్తా చాటుతున్నాడు ఎస్ ఎస్ థమన్. అల వైకుంఠపురములో సినిమా నుంచి థమన్ అసలు తగ్గడం లేదు. చేతిలోకి వస్తున్నవన్నీ పెద్ద సినిమాలే. అలా అని మీడియం బడ్జెట్ సినిమాలు చేయడం లేదా అంటే అలా ఏమీ లేదు. నాని లాంటి యంగ్ హీరోల సినిమాలకు థమన్ కావాల్సిందే. వకీల్ సాబ్ సినిమాలోని సాంగ్స్ కూడా థమన్‌కు విపరీతమైన క్రేజ్‌ను తీసుకువాచ్చాయి. అలా క్రేజ్ తెచ్చుకున్న థమన్ ..ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు.
ఇన్ని సినిమాలు చేస్తున్నా కథ, హీరోకు తగ్గట్టుగా సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ సినిమా సక్సెస్‌లో ఓ ప్రధాన కారణం అవుతున్నాడు. సినిమాకు సంగీతం కూడా చాలా ముఖ్యం. సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవాలంటే సాంగ్స్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా అవసరం. అది ఇవ్వడంలో ఇప్పుడు అందరికి థమన్ బెస్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరు థమన్ డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, బాలకృష్ణ, నాని, రవితేజ లాంటి స్టార్స్ అందరి సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.
Thaman: థమన్ ఇప్పుడు తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచాడని టాక్ వినిపిస్తోంది.
క్రేజ్‌కు తగ్గట్టు థమన్ ఇప్పుడు తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచాడని టాక్ వినిపిస్తోంది. అయితే థమన్ ప్రత్యేకంగా ఏ సినిమా నిర్మాతను ఇంతకావాలని రెమ్యునరేషన్ డిమాండ్ చేయడట. ఇప్పుడే కాదు మొదటి నుంచి ఇదే పద్దతిని అనుసరిస్తున్నట్టు తాజాగా స్వయంగా థమన్ చెప్పుకొచ్చాడు. సినిమా సక్సెస్ అయ్యేదాన్ని బట్టి నిర్మాతలే వారి సినిమా బడ్జెట్‌ను బట్టి మ్యూజిక్ కోసం ఎంత కేటాయించాలనుకుంటున్నారో అంతే నాకు ఇస్తున్నారు అని థమన్ తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే ఇలా ప్రత్యేకంగా నోరు తెరిచి ఓ ఫిగర్ చెప్పకుండా ఉండటంతోనే థమన్ వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడని క్లియర్‌గా తెలుస్తోంది. ఇక థమన్ ఆడియోకు రైట్స్ రూపంలో నిర్మాతలకు 5 కోట్ల వరకు దక్కుతోందట.