నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక భారీ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీబీ3 ఫస్ట్ రోర్ అన్న పేరుతో రిలీజ్ చేసిన టీజర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. బాలయ్య అంటే బోయపాటి ఎంతగా ప్రత్యేకతను చూపిస్తాడో మరోసారి ఈ టీజర్ తో నిరూపించారు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ముందు నుంచి ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో ఉంటారన్న మాట చెబుతూనే ఉన్నారు చిత్ర బృంద. ఈ క్రమంలో పలువురు పేర్లూ పరిశీలనలోకి వచ్చాయి. కాని అవన్ని రూమర్స్ అంటూ దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. బోయపాటి స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందట.
సీనియర్ బాలయ్య పాత్రకు భార్య పాత్రలో ఒకప్పటి సక్సస్ ఫుల్ హీరోయిన్ స్నేహను తీసుకోవాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. గతంలో స్నేహ.. బాలయ్య సరసన ‘పాండురంగడు’, ‘మహారథి’ సినిమాలు చేసింది. నిజంగా ఈ సినిమాలో గనక స్నేహ నటిస్తే బాలయ్య, స్నేహ ల ది కూడా హ్యాట్రిక్ సినిమా అవుతుంది. ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ‘సింహ’, ‘లెజెండ్’ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ లను అందుకున్నాయి. ఈ హ్యాట్రిక్ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.