Kuppam : కుప్పం తెలుగు తమ్ముళ్లు బాబును కోరిన దేమిటంటే?తప్పక తల ఊపారు కానీ అది జరిగే పనేనా?

Share

Kuppam : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల లో టీడీపీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చిన అనంతరం అనంతరం ఆయన పర్యటిస్తున్నారు. బాబు ఇలాకా అయిన..కుప్పంలో వెలువడిన ఫలితాలు టీడీపీని కలవరపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీడీపీకి కేవలం 13 మాత్రమే దక్కాయి.

Is that what the Kuppam Telugu brothers wanted from Babu?
Is that what the Kuppam Telugu brothers wanted from Babu?

ఇలాంటి సమయంలో పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేందుకు ఆయన గురువారం నుండి కుప్పంలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం బాబు రెండో రోజున కుప్పం, శాంతిపురం మండలాల్లో పర్యటించారు.అయితే ఆయన పర్యటన సందర్భంగా బాబుతో పాటు నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్లీలు దర్శనమివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్లెక్సీలతో ఆగితే అది పెద్ద విషయం కాదు.ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ని కుప్పం నియోజకవర్గానికి తీసుకురావాలని టిడిపి వారు చంద్రబాబు ని కోరడం ఈరోజు పర్యటన హైలెట్.

శాంతిపురంలో ఏం జరిగిందంటే?

శాంతిపురంకు చేరుకున్న బాబు కాన్వాయ్ వద్దకు టిడిపి నేతలు కార్యకర్తలు కొంతమంది వచ్చారు. కుప్పంకు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలని, ఆయనను ప్రచారంలో దింపాలని వారు డిమాండ్ చేశారు. అభిమానుల డిమాండ్ కు బాబు నవ్వుతూ తల ఊపారు. దీంతో జై..బాబు..జై జై బాబు నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది.కుప్పం కోటలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది.ఆయన ఫ్లెక్సీలు గురువారం నుంచి హల్ చల్ చేస్తున్నాయి. గతంలో బాబు పలుమార్లు ఇక్కడకు వచ్చినా..ఇలాంటి ఫ్లెక్సీలు కనిపించలేదు. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలకు ముందే దిశా..నిర్దేశం చేసి ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా..లేక..ఎవరికి వారు అభిమానులు ఏర్పాటు చేశారా ? అనేది ఆసక్తికరంగా మారింది

Kuppam : కుప్పం ప్రజలకు క్షమాపణలు!

14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తనను..ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారో అందరికీ తెలుసు..ప్రతిపక్షంలో ఉన్న తనను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు..ఎవరికోసం పడుతున్నా..నా కోసమా ? నాకు మరోసారి ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.గురువారం చిత్తూరు జిల్లా గడుపల్లికి బాబు వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి…మాట్లాడారు.
తాను పంచాయతీ ఎన్నికలను పట్టించుకోలేదని,రాష్ర్టాన్ని చక్కదిద్దాలనే ఉద్దేశ్యంతో కుప్పంని నిర్లక్ష్యం చేసినట్లు అంగీకరించారు .కుప్పం కంటే పులివెందులకే నీళ్లు ఇచ్చానని చెప్పుకొచ్చారు.24 గంటలూ ప్రజల కోసం ఆలోచించినట్లు, అందుకే అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామన్నారు. తన సమయంలో 85 శాతం మీకు ఇచ్చి ఉంటే..ఈ ఇబ్బందులు రాకుండా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం చేశారాయన. పొరపాటు జరిగింది..భవిష్యత్ లో జరగదని అనేకసార్లు చంద్రబాబు ఉద్ఘాటించారు .

 


Share

Related posts

Corona Virus : కత్రినా కైఫ్ కి కోవిడ్ పాజిటివ్..! ఆ హీరో వల్లనే?

Arun BRK

తేజ కి తిప్పలు తప్పడం లేదా ..సాయి పల్లవి ఏమంటుందో ..?

GRK

S.S Thaman: ఒక్క ప్రభాస్ మిగిలాడు..ఆయన్ని వదిలిపెట్టను థమన్

GRK