NewsOrbit
న్యూస్ సినిమా

Radhika Apte: రాధిక ఆప్టే అందుకే టాలీవుడ్‌లో సక్సెస్ కాలేదా..?

Radhika Apte: రాధిక ఆప్టే ..ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎంత టాలెంటెడ్ హీరోయిన్ అనేది ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీ అయిన టాలీవుడ్‌లో అటు నార్త్ ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మరాఠీలో పలు చిత్రాలు చేసి పాపులారిటీ తెచ్చుకున్న రాధికా ఆప్టే ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో రాధిక ఆప్టే ముందు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కంప్లీట్‌గా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లోనే వర్మ తెరకెక్కించాడు.

Is that why Radhika Apte was not successful in Tollywood?
Is that why Radhika Apte was not successful in Tollywood

ఈ సినిమాలో రాధికా ఆప్టే పోషించిన నిజ జీవిత పాత్ర బాగా పాపులర్ అయింది. దాంతో ఆమెకి సౌత్ భాషలలో బాగా క్రేజ్ అండ్ పాపులారిటీ వచ్చేసింది. అయితే తెలుగు కంటే కూడా హిందీ సినిమాల మీదే ఆమె ఎక్కువగా ఫోకస్ పెట్టి బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయింది. హిందీలో కొన్ని పాత్రలు రాధికా ఆప్టేను వెతుక్కుంటూ వస్తున్నాయి. పాత్ర ఎలాంటిదైనా రాధికా తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇదే రాధికా ఆప్టేకి బాగా అవకాశాలు రావడానికి ముఖ్య కారణం అవుతోంది. దర్శకుడు చెప్పిన కథ, అందులో పాత్ర నచ్చితే ఎంత రిస్కైనా ఆ పాత్రకోసం శ్రమిస్తుంది.

Radhika Apte: తెలుగులో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, ధోని, లెజెండ్, లయన్ సినిమాలు చేసింది.

ఆమె తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రాలలో ఓ హీరోయిన్‌గా నటించి బాగానే పేరు తెచ్చుకుంది. తెలుగులో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, ధోని, లెజెండ్, లయన్ సినిమాలు చేసింది. చెప్పాలంటే తెలుగులో చేసిన ఈ సినిమాలు ఆమెకి బాగానే పేరు వచ్చింది. కానీ ఇక్కడ ఆమె ఎక్కువగా ఫోకస్ చేయలేదు. హిందీ సినిమాలు, ఆ తర్వాత బాలీవుడ్ సినిమా అవకాశాలు వస్తుండంతో తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపించలేదు. హిందీలో ఆమె నటించిన అంధాదున్ బాగా పేరు తెచ్చింది. ఇందులో ఆమె పర్ఫార్మెన్స్‌కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఇదే పాత్రను ఇక్కడ తమన్నా పోషించింది. నితిన్ – నభా నటేశ్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన మాస్ట్రో సినిమా హిందీ అంధాధున్‌కి రీమేక్ సినిమానే. అంధాదున్ తర్వాత కూడా ఓ తమిళ సినిమా అలాగే వరుసగా హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమా చేస్తున్న రాధిక ఆప్టే తెలుగులో కంటిన్యూ అవకపోవడానికి కారణం ఆమెకి ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవడమేనని గతంలో వార్తలు వచ్చాయి. ఆమెను ఓ హీరో ఇబ్బందులు పెట్టాడని కూడా రాధికా ఆప్టే చెప్పుకొచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ కారణంగానే తను తెలుగు ఇండస్ట్రీ మీద ఆసక్తి చూపించలేదని టాక్ ఉంది.

Radhika Apte: రాధికా ఆప్టేకి ఒక్క తెలుగులో అవకాశాలు లేవేమో గానీ హిందీ, ఇంగ్లీష్ సినిమాలతో మాత్రం చాలా బిజీగా ఉంది.

అయితే ఇక్కడ వినిపించే టాక్ మరోలా ఉంది. రాధిక ఆప్టే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇది మన మేకర్స్‌కి కాస్త ఇబ్బంది కలిగించడం వల్ల తనకి తెలుగులో అవకాశాలు ఇవ్వలేదని ఒక టాక్ కూడా ఉంది. ఆమె ఎంచుకొనే కొన్ని పాత్రల వల్ల మన తెలుగు ఆడియన్స్ రాధికా పాప్టే అంటే పెద్దగా ఆసక్తి చూపించడం లేదని, అందుకే బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో రెండు సూపర్ హిట్ సినిమాలు చేసినా కూడా రాధిక తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్‌గా వెలగలేకపోయిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా రాధికా ఆప్టేకి ఒక్క తెలుగులో అవకాశాలు లేవేమో గానీ హిందీ, ఇంగ్లీష్ సినిమాలతో మాత్రం చాలా బిజీగా ఉంది.

 

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar