నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం బీబీ3. ద్వారకా క్రియోషన్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న హ్య్యట్రిక్ సినిమా కావడంతో బోయపాటి ఈ సినిమాని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడట. అభిమానులు బాలయ్య నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటారో అలాంటి అంశాలన్ని ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం.
ఇక బీబీ3 ఫస్ట్ రోర్ నందమూరి అభిమానులని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ కంప్లీటయిన ఈ సినిమా మళ్ళీ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుందని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక యంగ్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నాడని తాజా సమాచారం. ఆ హీరోనే నవీన్ చంద్ర. ఒకవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు స్టార్ నటిస్తున్న సినిమాలలో కీలక పాత్రలు అంగీకరిస్తున్నాడు.
ఇటీవల నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ ఆహా లో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. శాటిలైట్ బిజినెస్ కూడా మంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను నవీన్ చంద్ర కి బాలయ్య సినిమాలో యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ నెగిటివ్ షెడ్స్ లో ఉంటుందని అంటున్నారు. ఇక ఇంతకముందు కూడా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కీలక పాత్ర పోషించాడు నవీన్ చంద్ర. మొత్తానికి తన టాలెంట్ తో నందమూరి హీరోలకి బాగానే దగ్గరవుతున్నాడు ఈ యంగ్ హీరో.