The family man 2 : ది ఫ్యామిలీ మ్యాన్ 2..రీసెంట్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్. తెలుగు వారైన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. హిందీ, తెలుగు, తమిళంలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఇటీవల విడుదలయిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తమిళుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అక్కడి ప్రభుత్వం కూడా నిషేదించాలని ఆంక్షలు విధించింది. తమిళిలు మనోభావాలు దెబ్బతినేలా ది ఫ్యామిలీ మాన్ 2 ని రూపొందించారని ఎట్టి పరిస్థితుల్లో దీనిని విడుదల చేయకూడదంటూ గొడవలు మొదలైన సంగతి తెలిసిందే.
వాస్తవంగా అయితే ఈ వెబ్ సిరీస్ జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ప్రకటించిన తేదికి రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. సమంత మొదటిసారి డిజిటల్ రంగంలో అడుగుపెడుతూ ఈ వెబ్ సిరీస్ చేసింది. 2019లో వచ్చి సూపర్ హిట్ సాధించిన ది ఫ్యామిలీ మాన్ కి కొనసాగింపుగా ది ఫ్యామిలీ మాన్ 2ను రూపొందించారు. సమంత ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ కావడంతో దీని మీద ముందు నుంచి భారీగా అటు అక్కినేని అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
The family man 2 : ది ఫ్యామిలీ మాన్ 2 జూన్ 4న రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు.
మొదటి భాగంలో నటించిన బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ఇందులోనూ కంటిన్యూ అవుతున్నారు. సమంత రాజీ అనే పాకిస్తానీ టెర్రరిస్ట్ పాత్రలో నటించింది. ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని, సమంత పోషించిన పాత్ర తమిళ టైగర్లను చెడుగా చూపించేలా కనిపిస్తోందని వాదనలు వినిపించాయి. దీనికి దర్శకులు క్లారిటీ కూడా ఇచ్చారు. ట్రైలర్ చూసి ఇలా భావించడం సరికాదని చెప్పుకొచ్చారు. కానీ వారు కాంప్రమైజ్ కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ది ఫ్యామిలీ మాన్ 2 జూన్ 4న రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.