చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో దేశమంతా అభిమానులను సంపాదించుకున్న అవికా గోర్.. రాజ్ తరుణ్ సరసన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా ఈ బ్యూటీకి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దు గుమ్మ పెద్ద స్టార్ అయిపోతుందని ఆశించే సమయంలో కొన్ని పరిస్దితుల వల్ల టాలీవుడ్ కి దూరమైంది. ఇక సినిమాలు లేకపోవడంతో ఈ అమ్మడు డిప్రెషన్ తో బాగా బరువు పెరిగిందట. ఒకవైపు చేతిలో లేని అవకాశాలు మరో వైపు బొద్దుగా మారడం.. ఇలా తన రూపం తనకే అసహ్యం కలిగేలా ఉందని భావించిన అవికా బరువు తగ్గి ప్రత్యక్షమవ్వడంతో అభిమానులు ఆనందపడ్డారు.
ఈ క్రమంలో అవికా కు బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న ఆంటిమ్ చిత్రంలో అవకాశం లభించిందట. హీరో సల్మాన్ బావమరిది అయిన ఆయుష్ శర్మ సరసన నటించవలసి ఉండగా అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు గానీ ఈ చిత్రం నుండి అవికాను తొలగించారట. ఈమె స్దానంలో సప్నే సుహానే లడకా పాన్ కే నటి మహిమా మక్వానాను ఎంపిక చేశారట. అసలే అవకాశాల కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నా ఈ చిన్నారి పెళ్లి కూతురి పరిస్దితి మళ్లీ మొదటికి వచ్చిందని అంటున్నారు. బుల్లితెర నటిగా ఒక వెలుగు వెలిగిన అవికాను ప్రస్తుత్రం దురదృష్టం వెంటాడుతున్నట్లుగా ఉందని అందుకే వెండితెర మీద తన వెలుగులు విరజిమ్మలేక పోతుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోందట.
ఇక అందం అభినయం కలగలసిన అవికా కి మళ్ళీ సినిమా అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా తన సత్తా ఏంటో చూపిస్తుంది. టాలీవుడ్ లో అవికా నటించిన సినిమాలు ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తవ మామా సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాతే అవికా పరిస్థితి తారుమారయింది. చూడాలి మరి ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్ లో అవికా కి టాలీవుడ్ లో మళ్ళీ వస్తాయా లేదా..!