24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : కేసీఆర్ నిర్ణయం వెనుక ఇంత సీన్ ఉందా..!? నిఘా నివేదిక చెప్పిన నిజాలివే..!?

Share

KCR : సీఎం మార్పుపై కేసీఆర్​ వార్నింగ్​ ఇవ్వడం ఎవరిని ఉద్దేశించి అయి ఉండొచ్చని టీఆర్​ఎస్​ లీడర్లు చర్చించుకుంటున్నారు.

Is there such a scene behind the KCR decision ..!?
Is there such a scene behind the KCR decision ..!?

గత కొన్ని రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసబెట్టి.. కేటీఆర్ ను సీఎం చేయాలని  డిమాండ్  చేశారు. అప్పుడు వాటిని ఎవరూ ఖండించలేదు. దీంతో ప్రగతిభవన్ వర్గాల సూచనల మేరకే మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని భావించి మిగతా లీడర్లు కూడా పోటీలు పడి కేటీఆర్​కు గ్రీటింగ్స్​ చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్​ ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే ‘‘ఫ్యూచర్ సీఎం కేటీఆర్  కంగ్రాట్స్’’ అంటూ అభినందనలు తెలిపారు. ఇలా చాలా మంది లీడర్లు కేటీఆర్ సీఎం కావాలని పదే పదే డిమాండ్ చేసినా పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు సీరియస్ అయ్యారని టీఆర్​ఎస్​ లీడర్లు ఆరా తీస్తున్నారు.

KCR : ట్రయల్ రన్ ఫెయిల్ ?

కేటీఆర్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేయడం వికటించిందనే టాక్​ టీఆర్​ఎస్​ వర్గాల్లో ఉంది. ‘‘కేసీఆర్ అసమర్థుడా? కొడుకునే ఎందుకు సీఎం చేయాలి? దళిత నేతనైనా, బీసీ నేతనైనా సీఎం చేయాలి’’అని అపోజిషన్ పార్టీలు డిమాండ్ చేయడంతో కేసీఆర్​కు  కోపం వచ్చిందని పార్టీలో జరుగుతోంది.

పావులు కదిపిన ఈటెల!

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ‘కేటీఆర్ సీఎం’  డిమాండ్  జోరందుకుంది. ముందు మినిస్టర్లు స్టార్ట్ చేశారు. తర్వాత ఎమ్మెల్యేలు అందుకున్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని మాట్లాడకపోతే ఎక్కడ వెనుకపడి పోతామోననే  ఆందోళనతో లీడర్లు పోటీలు పడి ప్రకటనలు చేశారు. ఇదంతా జరుగుతున్నా ప్రగతిభవన్  వర్గాలు వారించలేదు.నెల కింద మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘సీఎం మార్పు ఉంటే ఉండొచ్చు’’ అని చెప్పారు. అటు తర్వాత ‘‘సీఎంగా కేటీఆర్ అయితే తప్పేంటి? ఇప్పుడైతే సీఎం కేసీఆర్ అంతా బాగానే చేస్తున్నరు. ఏ విషయమైనా సరైన టైంలో కేసీఆరే నిర్ణయం తీసుకుంటరు’’ అని  మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ‘‘కేటీఆర్ సీఎం పదవికి సమర్థుడు.ఆయన్ను సీఎంగా అందరూ అంగీకరిస్తరు’’ అని మంత్రి గంగుల కమలాకర్  పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ కనుసన్నల్లోనే కేటీఆర్ సీఎంగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నరు. కేసీఆర్  ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నం’’ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్  చెప్పారు. సీఎం అయ్యేందుకు కేటీఆర్‌‌‌‌కు అన్ని అర్హతలు ఉన్నాయని వికారాబాద్​ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​ అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ ముఖ్యమంత్రిగా జరగాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్  అన్నారు. రెండు రోజుల కింద ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య..  కేటీఆర్ సీఎం కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్టు తిరుమలలో అన్నారు. గతంలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ కూడా కేటీఆర్​ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

నిఘా వర్గాల సమాచారంతో నిర్ణయం రివర్స్?

అయితే ప్రజల్లోకి సీఎం మార్పు సూచనలు వెళ్లాక వారి అంతరంగం ఎలా వుంది?కేటీఆర్ కు అనుకూల వాతావరణం ఉందా లేదా?ఇప్పటికిప్పుడు సీఎం పదవి నుండి తప్పుకుంటే కెసిఆర్ ని ఏమనుకుంటారు?ప్రతిపక్షాలు ఈ విషయంలో ఎలా స్పందిస్తాయి తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయిలో నిఘా వర్గాల నుండి నివేదికలు తెప్పించుకున్నారని,అది కాస్త ప్రతికూలంగా ఉండటంతో ఆయన వెనక్కు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు .

 


Share

Related posts

KCR : కాంగ్రెస్ బీజేపీలకు మైండ్ పోయే రీతిలో కేసీఆర్ స్ట్రోక్!ఊహకే అందని అభ్యర్థి ఎమ్మెల్సీ బరిలోకి!!

Yandamuri

కఠిన నిర్ణయం.. పెళ్ళికి అంతకంటే ఒక్కరు ఎక్కువ హాజరైన భారీ జరిమానా!

Teja

ఆ ఐఏఎస్ ని జగన్ జైలుకి పంపిస్తారా…?

Srinivas Manem