covid vaccine: సీఎం ల పని పట్టనున్న మోదీ? ఏం స్కెచ్ గురూ

PM Modi covid vaccine
Share

covid vaccine: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు నమోదవుతున్న చావులకి, ప్రాణాల కోసం పోరాడుతున్న పేషెంట్లు తరఫున ప్రతి ఒక్కరూ మోదీ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. అసలు ఎంత మంది నిపుణులు రెండవ వేవ్ పైన ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అందరూ ఆరోపిస్తున్నారు. వారి ఇష్టానుసారంగా ఎలక్షన్లు నిర్వహించడం, ర్యాలీలు పెట్టుకోవడం వంటివి చేసి ప్రజల ప్రాణాలను రిస్క్ లోకి నెట్టారు అన్నది అందరి భావన. 

 

PM Modi covid vaccine
PM Modi

అయితే మోడీ ఇమేజ్ జాతీయంగానూ, అంతర్జాతీయంగా తీవ్రంగా డ్యామేజీ అయిపోయింది. దెబ్బకు వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం కష్టమని పలువురు అనుకుంటున్నారు. అయితే ఈ సమయంలోనే మోదీ పలు రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే… తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ఆపివేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అరకొరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. రెండో డోస్ వేయించుకోవాల్సిన వారే లక్షల్లో ఉండిపోయారు. 

ఇక కేంద్రం నుండి తమకు వ్యాక్సిన్లు లభించలేదని అలాగే ఆక్సిజన్ కూడా తగినంత లభించడం లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుంది. ఇవన్నీ చూస్తూ కూడా మోడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..? అని అందరికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే కొంతమంది బీజేపీ వ్యతిరేకదారులు చెబుతున్నది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యాక్సిన్ సేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేసిందట. ఒక రకంగా ఇది నిజం అని చెప్పాలి. 

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్లోబల్ టెండర్లకు ఆహ్వానించాయి. అయితే ఈ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఇది చాలా సమయం తీసుకుంటుంది అన్నది మాత్రం ఖాయం. ఈ లోపల వ్యాక్సిన్లు లేనందుకు ప్రజలంతా రాష్ట్ర ముఖ్యమంత్రులు టార్గెట్ చేస్తారు. దీంతో మోడీపై ఉన్న మచ్చ కొద్ది కొద్దిగా మానిపోతుంది. ఈ లోపల కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను ఎక్కువగా ఉత్పత్తి చేసి ఒక్కసారిగా అందరూ కరువులో ఉన్న సమయంలో రాష్ట్రాలకు పెద్ద ఎత్తున దోసెలు పంపిణీ చేసి సరిగ్గా క్యాంపెయిన్ చేసుకుంటే మళ్లీ మోడీ ఆపద్బాంధవుడు పాత్ర పోషించవచ్చు అన్నది వారి ప్లాన్ అని పలువురు అంటున్నారు.


Share

Related posts

ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు

Siva Prasad

పౌరుషం లేకనా ! ప్రత్యామ్నాయ పార్టీ కాన రాకనా !

Yandamuri

Uppena : ఉప్పెన ఆల్ ఇండియా రికార్డ్‌ను బ్రేక్ చేసి సంచలనం సృష్ఠించింది…!

GRK