టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన సినిమా ‘వి’. నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ తో ఆగిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల ఓటీటీలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్స్ క్యార్యక్రమాలు కంలీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న నాలుగు సినిమాలు త్వరలో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాల్లో ఉన్నారన్న ప్రచారం మొదలైంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని రిసెంట్ గా క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని క్లారిటీ ఇచాడు. మాస్ మహారాజ త్రవితేజ, శృతిహాసన్ ఈ సినిమాలో జంటగా నటించారు.
ఇక తాజాగా వి సినిమా బృందం కూడా తమ సినిమాని థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారట. ఇప్పటివరకూ ఇంద్రగంటి, నాని కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన ఇంద్రగంటి ఈ సారి సుధీర్ ను పవర్ఫుల్ పోలీస్ రోల్ లో చూపిస్తున్నాడు. నాని, సుధీర్ బాబు పాత్రలు రెండు పోటా పోటీగా ఉంటాయట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న ధీమాతో ఉన్నారు చిత్ర యూనిట్.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!