Acharya : ఆచార్య్‌లో పూజా హెగ్డే క్యారెక్టర్ ఇదేనా..?

Pooja-Hegde-Ram-Charan in archarya
Share

Acharya : ఆచార్య సినిమా మీద దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే చరణ్‌కి జంటగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే కనిపించబోతోంది.

is-this-the-character-of-pooja-hegde-in-acharya
is-this-the-character-of-pooja-hegde-in-acharya

అయితే ఇన్నాళ్ళ నుంచి ఆచార్య సినిమాలో పూజా హెగ్డే రోల్ ఎంటన్నది మేకర్స్ నుంచి క్లారిటీ లేదు. అసలు పూజా హెగ్డే ఉన్న విషయాన్ని కూడా చాలా సస్పెన్స్‌లో ఉంచారు. చరణ్ పాత్రని..తన క్యారెక్టర్ పేరును రివీల్ చేసిన మేకర్స్ పూజా హెగ్డే రోల్ గానీ ..తన పాత్రకి సంబంధించిన చిన్న హింట్ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. అయితే తాజాగా పూజా హెగ్డే పాత్ర ఇదేనంటూ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

Acharya : పూజా క్యారెక్టర్ ఆచార్యలో చాలా ఎమోషనల్‌గా సాగుతుందట..?

పూజా హెగ్డే క్యారెక్టర్ సెకండాఫ్‌లో వస్తుందట. ఇప్పటికే పూజా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసినట్టుగా సమాచారం. సినిమాలో పూజా హెగ్డే పాత్ర సుమారు 20 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. చరణ్ – పూజా హెగ్డే మీద వచ్చే కొన్ని కాంబినేషన్ సీన్స్ సినిమాకి బాగా హైలెట్ అవుతాయట. ఇద్దరి మీద ఒక డ్యూయట్ సాంగ్ ఉంటుందని సమాచారం. ఇక పూజా హెగ్డే రోల్ చనిపోతుందని చెప్పుకుంటున్నారు. అంటే పూజా క్యారెక్టర్ ఆచార్యలో చాలా ఎమోషనల్‌గా సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మే 13న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.


Share

Related posts

చిరంజీవి చెప్పారు..మేము తప్పక పాటిస్తాం…!!

DEVELOPING STORY

సిబిఐ కేసు విచారణ నుండి జస్టిస్ రమణ కూడా నిష్క్రమణ

somaraju sharma

Today Gold Rate: ఎగసిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..!!

bharani jella