కియారా అద్వానీ ఇప్పుడు చాలా బిజీ హీరోయిన్. మేకర్స్ కియారా అద్వానీ డేట్స్ కావాలంటే దాదాపు సంవత్సరం ముందు నుంచి ట్రై చేస్తుండాలి. అంత బిజీ హీరోయిన్ గా బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తోంది కియారా అద్వాని. ఎంత ట్రై చేసినా కియారా అద్వానీ ని మళ్ళీ మన తెలుగు సినిమాలలో చూడ లేకపోతున్నాము. మన టాలీవుడ్ దర్శక, నిర్మాతలు కియారా అద్వానీ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నారు. కాని హిందీ సినిమాలు చేతిలో ఉండటం తో ఇక్కడి వాళ్ళ కి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతోందట.
అయితే ఇలా బాలీవుడ్ లో కియారా అద్వానీ క్షణం తీరిక లేకుండా ఉండటానికి.. వరసగా సినిమా అవకాశాలు చేతిలో ఉండటానికి కియారా అద్వానీ ఒక గొప్ప లాజిక్ ఉపయోగిస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ లాజిక్ అందరూ మేయింటైన్ చేయలేరన్న టాక్ కూడా వినిపిస్తోంది. వాస్తవంగా ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఎన్ని సినిమాలు వరసగా చేస్తున్నా… ఒకటో రెండో ఫ్లాప్స్ పడగానే చిన్నా గ్యాప్ వస్తుంది. ఆ చిన్న గ్యాప్ రాకుండా కియారా అద్భుతంగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుందట.
ఏదైనా సినిమా రిజల్ట్ కాస్త అటు ఇటుగా ఉండి.. అవకాశాలు తగ్గుతాయేమో అనే సమయంలో చటుక్కున బోల్డ్ గా ఉన్న క్యారెక్టర్ కి సై అని ఆ గ్యాప్ రాకుండా జాగ్రత్తపడుతుందని బాలీవుడ్ మీడియాలో చెప్పుకుంటున్నారు. తప్పదు మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఏదో ఒక పక్కా ప్లాన్ ఉండాలి.. అదే కియారా అద్వానీ చేస్తోంది. ఏ హీరోయిన్ అయినా అవసరాన్ని బట్టి బోల్డ్ సినిమాలు చేయాలి. లేదంటే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో వెనకబడిపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కియారా అద్వానీ మూడు బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. సిధార్థ్ మల్హోత్రా సరసన షెర్షా కార్తీక్ ఆర్యన్ తో ‘భూల్ భూలైయా 2’ వరుణ్ ధావన్ సరసన ‘జగ్ జగ్ జీయో’. ఇంకా తెలుగులో ఏ సినిమా కమిటవలేదట.