Hebba patel: యంగ్ హీరోయిన్స్‌కి గనక మంచి హిట్స్ రెండు పడితే వరుసగా క్రేజీ ఆఫర్స్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు క్యూ కడతారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుర్ర భామ, గ్లామర్ పాత్రలకి సూటయ్యే ఫిగర్..కాస్త పర్ఫార్మెన్స్ చేయగలిగితే ఆ తర్వాత ప్రత్యేకంగా పాత్రకి తగ్గట్టు షూటింగ్‌కి ముందు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయించి అవకాశాలు ఇస్తున్నారు. తేజ, శేఖర్ కమ్ముల లాంటి దర్శకులందరూ కొత్త వారిని ఎంచుకొని ఓ నెల రోజులు సీన్స్ అన్నీ బాగా ప్రాక్టిస్ చేశాక సెట్స్ మీదకి వెళుతున్నారు. వరుణ్ తేజ్, నాగ చైతన్య, సాయి పల్లవి లాంటి వారైనా షూటింగ్‌కి ముందు ప్రాక్టీస్ చేయాల్సిందే.
అంతగా ఎంకరేజ్ చేస్తున్నవారున్నారు. త్రివిక్రం శ్రీనివాస్, హరీశ్ శంకర్ లాంటి దర్శకులు ఒకే హీరోయిన్ని తమ సినిమాలలో కంటిన్యూ చేస్తూ ఒక టీంని సెట్ చేసుకుంటున్నారు. పూజా హెగ్డేకి ఇటు త్రివిక్రం శ్రీనివాస్, అటు హరీశ్ శంకర్ లాంటి దర్శకుల సపోర్ట్ బాగా ఉంది. అందుకే పూజా హెగ్డే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు పూజా హెగ్డే రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. దాదాపు 4 కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్టేజ్‌లో ఉంది. తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
Hebba patel: హెబ్బా పటేల్ ఎలా వచ్చిందో అలా ఫేడౌట్ అయింది.
అలాగే రష్మిక మందన్న కూడా లక్ బాగా కలిసి వచ్చి అతి కొద్ది రోజుల్లోనే సౌత్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. పుష్ప వంటి పాన్ ఇండియన్ సినిమాలను, బాలీవుడ్లో ఒక వైపు సిద్దార్థ్ మల్హోత్రా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్‌తోనూ సినిమాలు చేసే అవకాశాలు అందుకుంటోంది. చెప్పాలంటే పూజా హెగ్డే తర్వాత ఆ రేంజ్ క్రేజ్ మేయింటైన్ చేస్తుందంటే రష్మిక మందన్ననే. ఈమె కూడా దాదాపు 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందట. ఇదే క్రమంలో సాయి పల్లవి, కీర్తి సురేశ్, ఐశ్వర్య రాజేశ్ లాంటి వారు మంచి క్రేజీ హీరోయిన్స్‌గా మారారు.
కానీ వీరికంటే చిన్న వయసులో మంచి బ్లాక్ బస్టర్స్ అందుకున్న హెబ్బా పటేల్ మాత్రం ఎలా వచ్చిందో అలా ఫేడౌట్ అయింది. అవకాశాలు లేక ఐటెం సాంగ్స్‌ను కూడా నమ్ముకుంది. కానీ హెబ్బాకి ఆ ఐటెం సాంగ్స్ కూడా క్రేజ్ తీసుకు రాలేకపోయాయి. కుమారి 21 ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ తర్వాత చేసిన సినిమాలతో మాత్రం ఆ స్థాయి హిట్స్ అందుకోలేకపోయింది. చేయడానికి సినిమాలనైతే చేసింది. కాని ఆ సినిమాలు హెబ్బా కెరీర్‌కి మైనస్ అవుతూ వచ్చాయి.
Hebba patel: మితి మీరిన రొమాంటిక్ సన్నివేశాలు చేసి విమర్శలకి గురైంది.
ఈడో రకం ఆడో రకం, మిస్టర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్, అంధగాడు, ఏంజిల్ లాంటి సినిమాలు చేసింది. ఇవేవి హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ అయ్యేంత హిట్స్ ఇవ్వలేకపోయాయి. దాంతో కుమారీ 21 ఎఫ్ లాంటి రొమాంటిక్ సినిమా చేసే అవకాశం రావడంతో క్రేజ్ వస్తుందని ఆశపడి 24 కిసెస్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో మితి మీరిన రొమాంటిక్ సన్నివేశాలు చేసి విమర్శలకి గురైంది. సినిమా మొత్తం ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం తప్ప కథ, కథనం అసలేమీ లేదని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
దాంతో హెబ్బా పటేల్ కెరీర్ ఒక్కసారిగా కిందకి జారిపోయింది. మంచి కెరీర్ సంపాదించుకొని స్టార్ హీరోయిన్గా కనీసం 10 ఏళ్ళు ఓ వెలుగు వెలగాల్సిన హెబ్బా..అన్నీ కెరీర్ స్పాయిల్ అయ్యే కథలనే ఎంచుకొని తప్పులు మీద తప్పులు చేసి కనపడకుండా పోయింది. ఎంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా కూడా హెబ్బా పటేల్‌కి అవకాశాలు దక్కడం లేదు. రాం సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఊపినా అది తన కెరీర్‌కి ఉపయోగపడింది లేదు. అదే మంచి కథలను ఎంచుకుంటే మాత్రం హెబ్బా పటేల్‌కి ఉన్న అందానికి, టాలెంట్‌కి ఇప్పుడున్న హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇచ్చేది.