రష్మిక బ్యూటీ సీక్రెట్ ఇదా .. ప్రతీ అమ్మాయి తెలుసుకోవాల్సిన సీక్రెట్..!

ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక అతొకొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో టాప్ ప్లేస్ లో వచ్చి చేరింది. నంబర్ వన్ పొజిషన్ కోసం కీర్తి సురేష్, పూజా హెగ్డే లతో పోటీ పడుతుంది. అందుకు తగ్గట్టుగానే రష్మిక కి పాన్ ఇండియన్ సినిమాలలో ఛాన్స్ వస్తోంది.

Rashmika Mandanna's house raided by IT officials after rumours of her being highest paid actress | Regional-cinema News – India TV

కాగా రష్మిక మందన్న బ్యూటీ సీక్రెట్స్ చాలానే ఉన్నాయట. హీరోయిన్ అంటే గ్లామరస్ గా కనిపించాలి. రక రాకాల డైట్ ని ఫాలో అవ్వాలి. అయితే చాలామంది హీరోయిన్స్ మాత్రం నేచురలాటీగా నే అందానికి మెరుగులు దిద్దుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు రష్మిక కూడా అదే ఫాలో అవుతోందట. రష్మిక ఫ్యామిలీ కర్ణాటకలో వుంటుందన్న సంగతి తెలిసిందే. కాని రష్మిక మాత్రం టాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తున్నందు వల్ల హైదరాబాద్ లో వుంటుంది.

అయితే ఇలా నెలలుగా ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఎవరైనా ఇంటి నుండి పచ్చళ్లు, స్వీట్లు, ఇష్టమైన వంటకాలు అమ్మ చేతి నుంచే తయారు చేయించుకొని తెప్పించుకుంటుంటారు. కాని రష్మిక మాత్రం అన్నిటకంటే ముఖ్యంగా నెయ్యి తెప్పించుకుంటుందట. ఇంటిలో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యిని రష్మిక ఎక్కువగా ఉపయోగిస్తానని చెబుతుంది. సమంత, రకుల్ మాదిరిగా రష్మిక కూడా ఫిట్నెస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది.

అయితే ఇంటి నుండి తెచ్చుకున్న నెయ్యిని వంటలకు వాడుతుందట. రష్మిక ఫ్యామిలీకి కర్ణాటకలో వ్యవసాయ భూములు, పొలాలు వున్నాయి. ఆమె ఇంటిలో ఆవులను పెంచుతారట. ఆవుపాలు నుండి తీసిన వెన్నతో తయ్యారు చేసిన నెయ్యిని రష్మిక హైదరాబాద్ తెచ్చుకుంటుందని చెప్పుకొస్తుంది. తను సన్నగా నాజూకుగా ఉండటానికి నెచురల్ గా కనిపించడానికి.. తన గ్లామర్ కి సీక్రెట్ ఇదే అని అంటోంది.