Vakeel saab : వకీల్ సాబ్ మరి కొన్ని రోజుల్లో థియోటర్స్లోకి రాబోతోంది. నేడు గ్రాండ్ గా థియోట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు గాను ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలలో కొన్ని థియోటర్స్ ని లిస్ట్ చేశారు. ఈ థియోటర్స్ లో ఈరోజు సాయంత్రం 6గం.లకు వకీల్ సాబ్ థియోట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో నిర్వహిస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరాం, లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు చోట్ల వకీల్ సాబ్ బెలూన్స్ ని ఎగురవేశారు.
ఇలా వినూత్నంగా వకీల్ సాబ్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో సినిమా మీద భారీగా అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే రెండు భాషల్లో చూసేసిన సినిమా అయినా మన నేటివిటీకి…పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు కథలో చాలానే మార్పులు చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో పాటలు..ఫైట్లు లేకపోయినా పవన్ కళ్యాణ్ కోసం తెలుగులో పెట్టేశారు. అంటే స్క్రిప్ట్ లో ఎన్ని మార్పులు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మూడు పాటలు అభిమానులను ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
Vakeel saab : పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో.. దిల్ రాజు బాగానే ఖర్చు చేశాడు..!
ఇక ఫైట్స్ అంటే ఫ్యాన్స్ ఎలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్ని చేసిన వకీల్ సాబ్ రిలీజ్ కి కరోనా దెబ్బ కొడుతుందా అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్కూల్స్..కాలేజెస్ మూసి వేశారు. ఇలాంటి సమయంలో అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షో..బెనిఫిట్ షోలూ ప్లాన్ చేయడం కరెక్టేనా అన్న మాట వినిపిస్తోంది. అయితే ఫస్ట్ డే హిట్ టాక్ వస్తేగాని వకీల్ సాబ్ సేఫ్ జోన్ లోకి రాడు. చూడాలి మరి వకీల్ సాబ్ సినిమా రిలీజయ్యాక ఎలాంటి టాక్ వస్తుందో. ఇక పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయనతో సినిమా చేయాలన్న కల తో దిల్ రాజు బాగానే ఖర్చు చేశాడు.