వర్మ లాయర్ వీకా ? మర్డర్ సినిమా విషయం లో డిప్రెషన్ లో రామూ ?

Share

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిన్న ట్వీట్ తో చిర్రెత్తిస్తుంటాడు. అదే ట్వీట్ ప్లాట్ ఫాం మీద ఉన్నవాళ్ళని ఓవర్ నైట్ స్టార్ చేసేస్తుంది. విచిత్రం ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ కి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతకంటే రెండు రెట్లు యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం తీస్తున్న సినిమాలలో ఏమీ ఉండదని తెలిసినా ..ఆ క్షణం వరకు లైట్ తీసుకున్న జనాలు ఒక్కసారిగా మూడ్ మార్చేసుకొని వర్మ సినిమా చేసేస్తారు. జనాలని అలాంటి మైండ్ సెట్ లోకి తెచ్చి పడేశాడు ఈ వివాదాల దర్శకుడు.

Ram Gopal Varma stirs up controversy as he lights cigarette ...

ఇక ఒక కథ అనుకొని దానిని సినిమాగా తీయడంలో అర్జీవిని మించిన వారు మరొకరు ఉండరు. మగతా మేకర్స్ అంతా సినిమా ప్రమోషన్స్ కి కోట్లు ఖర్చు పెడుతుంటే వర్మ మాత్రం తన ఫోన్ తో సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ పెట్టి ఫ్రీగా తన సినిమాని ప్రమోట్ చేసుకొని జనాలని థియోటర్స్ కి రప్పిస్తాడు. ఇక వాస్తవిక సంఘటనలతో సినిమా తీయడం వర్మకి బాగా అలవాటైన ఫార్మాట్. అలా తిసిన ఒక సినిమా వర్మ కి షాకిచ్చింది.

రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా వర్మ ‘మర్డర్’ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాకి కుటుంబ కథా చిత్రమ్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించింది. మా అనుమతి లేకుండా తమ ఫోటోలు పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించిది.

ఈ కేసు విచారణను నల్గొండలోని ఎస్సీ ఎస్టీ కోర్టు పూర్తి చేసి కీలక తీర్పును ఇచ్చింది. ‘మర్డర్’ సినిమా నిలిపివేయాలని నల్గొండ జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మిర్యాలగూడ అమృత ప్రణయ్ మారుతీరావు ఘటనపై రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా వర్మకే రివర్స్ లో గట్టి షాకిచ్చింది. మరి వర్మ ప్లాన్ బి ఏదైనా వర్కౌట్ చేసి సినిమా రిలీజ్ చేస్తాడా.. లేక లైట్ తీసుకొని ఇంకో సినిమా మొదలు పెడతాడా చూడాలి. మొత్తానికి వర్మ కి సరైన లాయర్ దొరకలేదన్న మాట ఇప్పుడు బాగా ప్రచారం అవుతోంది.


Share

Related posts

నిహారిక పెళ్ళికి ముందే బయటకి వచ్చిన ఒక ఫోటో… సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది.

Naina

Kushi Kushiga : ఖుషీ ఖుషీగా షోలో స్టాండప్ కామెడీని ఇరగదీస్తున్న సద్దాం

Varun G

Pawan Kaylan : పవన్ తో త్రివిక్రమ్ మల్టీస్టారర్…? ఇంకో హీరో ఎవరంటే….

sekhar