Venkatesh : విక్టరీ వెంకటేశ్ సినిమాలు చాలా ప్రత్యేకం. అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు మాస్ ఆడియన్స్, మరొక వైపు యూత్ ఆడియన్స్..ఇలా అన్నీ వర్గాల వారిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్ నుంచి సినిమా వస్తుందంటే 99 శాతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం ఖాయమని నమ్మకంగా ఉంటారు. ఇక ప్రస్తుతం వెంకీ తన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నారు. చేతిలో మూడు సినిమాలున్నాయి. ఆ మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాయి కాబట్టి ఆయన సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ నారప్ప సినిమా పూర్తి చేశాడు. ప్రియమణి ఆయన కి జంటగా నటించడమే కాదు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది. తమిళ సినిమాకి అధికారకంగా రీమేక్ చేశారు. ఆ సినిమాకి కోలీవుడ్ లో భారీ వసూళ్ళు అలాగే అవార్డులను దక్కించుకుంది. దాంతో నారప్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక మలయాళ హిట్ సినిమా సీక్వెల్ దృశ్యం 2 కూడా వెంకటేశ్ కంప్లీట్ చేశాడు. ఇప్పటికే దృశ్యం లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. అదే హిట్ సీక్వెల్ కి దక్కుతుందని ఇండస్ట్రీ వర్గాలు మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
Venkatesh : వెంకటేశ్ అకౌంట్ లో ఎన్ని హిట్స్ చేరతాయో.
అంతేకాదు వందకోట్ల క్లబ్ లో నిలిచిన ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ ఎఫ్ 3లో కూడా వెంకటేశ్ నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఇందులో మరొక హీరోగా నటిస్తున్నాడు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని ప్రకటించారు. మొత్తం ఈ ఏడాదిలోనే వెంకీ నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మూడు సినిమాలతో భారీ హిట్స్ అందుకుంటాడని అభిమానులు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి వెంకీ అకౌంట్ లో ఎన్ని హిట్స్ చేరతాయో.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!