Trivikram : త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించబోతున్నాడా.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. విక్టరీ వెంకటేష్‌కి టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వెంకటేష్ సినిమాలన్నీ ఫ్యామీలీ ఓరియెంటెడ్ గానే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయనకి కథ నచ్చి.. ఆ కథలో పాత్రకి తను సూటవుతాడనుకుంటే.. పర భాషా చిత్రమైనా కూడా రీమేక్ చేయడానికి రెడీ అయిపోతాడు. వెంకీ కెరీర్లో సగానికి పైగా రీమేక్ సినిమాలే చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం వెంకీ స్పీడ్ మామూలుగా లేదు.
వరసగా సినిమాలను కమిటవడమే కాదు..ఒకదాని తర్వాత ఒకటి జెట్ స్పీడ్‌లో పూర్తి చేసేస్తున్నాడు. ఈ ఏడాది వెంకీ నుంచి 3 సినిమాలు రాబోతున్నాయి. వాటిలో రెండు సినిమాలు రీమేక్ సినిమాలే కావడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాని వెంకటేష్ ఇక్కడ ‘నారప్ప’గా రీమేక్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అధికారకంగా రిలీజ్ డేట్ మేకర్స్ ప్రకటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి నటించింది.
Trivikram : త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ 75వ సినిమా..?
అలాగే సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ చేస్తున్నాడు. ఈ క్రమంలో మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటిసున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ మీనా.. వెంకీకి జంటగా నటిస్తుండగా ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతు జోసెఫ్ తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తున్నాడు. అయితే వెంకీ తన కెరీర్లో 75వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నట్టు తాజా సమాచారం. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.