Venu sriram : వేణు శ్రీరామ్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయి చాలా ఏళ్ళు అవుతోంది. కానీ ఆయన చేసింది మాత్రం మూడంటే మూడు సినిమాలే. మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్, రెండవ సినిమా ఎం.సి.ఏ. మూడవ సినిమా అల్లు అర్జున్ తో ఐకాన్ అనౌన్స్ అయింది. పోస్టర్ కూడా వదిలారు. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఇక వేణు శ్రీరామ్ టాలీవుడ్ లో పెద్ద హీరో సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాలు అందుకోవడం కష్టమే అని చెప్పుకున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో లక్ ఎప్పుడు ఎలా ఫేవర్ చేస్తుందో ఎవరూ చెప్పలేదు.
అందుకే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. వకీల్ సాబ్ సినిమాకి దర్శకత్వం వహించి పెద్ద దర్శకుల లిస్ట్ లో చేరాడు. ఐకాన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే బాధ కి నాలుగింతలు ఆనందాన్ని వకీల్ సాబ్ తో పొందాడు. అవకాశం అందుకోవడం గొప్ప విషయం కాదు. దాన్ని నూటికి నూరు శాతం నొలబెట్టుకోవడమే గొప్ప విషయం. వేణు శ్రీరామ్ ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. దిల్ రాజు – పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టార్ డైరెక్టర్ అయ్యాడు.
Venu sriram : వేణు శ్రీరామ్ తో నాని సినిమా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.
అయితే ఐకాన్ ట్రాక్ ఎక్కుతుందని అనుకుంటే సీన్ మళ్ళీ రివర్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇంతక ముందు ఎం.సి.ఏ చేసిన నాని తోనే వేణు శ్రీరామ్ తర్వాత సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అంటే ఐకాన్ ఇక లేనట్టే అనేదే దీనికి అర్థం అనుకోవాలి. నాని ఇప్పటికే రెండు సినిమాలతో బిజిగా గడుపుతున్నాడు. ఈ ఏడాది చివరకి గానీ ఈ రెండు సినిమాలు పూర్తి కావు. శ్యామ్ సింగ రాయ్ కలకత్తా నేపథ్యంలో సాగుతున్న వెరైటీ సినిమా. అంటే సుందరానికి అనేది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా. వీటి తర్వాతే వేణు శ్రీరామ్ తో నాని సినిమా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటికి ఏం జరుగుతుందో చూడాలి.