NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

విజయసాయి ఎన్నికల కమిషనర్ అయ్యారా!! ఎప్పుడు ఎలా?

ఎన్నికలు నిర్వహించేది తేదీలు ప్రకటించేది దాని నిర్వహణ అంతా… భారతదేశంలో ఓ స్వతంత్ర వ్యవస్థ చేస్తుంది. దానిని ఎన్నికల కమిషన్ అంటారు. ఎన్నికల కమిషన్కు భారత రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించింది. ప్రత్యేక అధికారాలు ప్రత్యేక విధులు ఉంటాయి.. ఈ కమిషన్ విషయాల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు… వారి పై అధికారం ఎవరికీ ఉండదు… మొత్తం రాష్ట్రా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, కేంద్రం లో లోక్సభ ఎన్నికలను జాతీయ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తే, రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు నిర్దిష్ట కాలం ఉంటుంది. అలాగే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పదవి పూర్తవకుండానే చనిపోతే అక్కడ మళ్లీ ఉప ఎన్నికలు తగిన సమయానికి నిర్వహించడం ఎన్నికల కమీషన్ బాధ్యత. ఇలా చాలా విధులు బాధ్యతలు ఎన్నికల కమిషన్ కు ఉంటాయి కాబట్టి వారికి సర్వస్వతంత్ర ఉంటుంది. దీనిలో పాలకులు లేదా రాజకీయ నాయకులు వేలు పెట్టడానికి లేదు… ఇది లెక్క…….. అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని అనుకున్నట్టు సాగితే చెప్పుకోవడానికి ఏముంటుంది? ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వానికి మధ్య స్థానిక సంస్థల ఎన్నికల పై కోర్టులో గొడవ నడుస్తుంటే మధ్యలో వైసీపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం స్థానిక సంస్థలను ఏప్రిల్ మే నెలలో నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరం వింతగా ఉందని రాజకీయ నాయకులు న్యాయనిపుణులు చెబుతున్నారు. అసలు ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న ప్రశ్న టాలెత్తుతోంది.. ఇది కచ్చితంగా ఎన్నికల కమిషన్ విధులకు ఆటంకం కలిగించడమే అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

ఎలా ప్రకటిస్తారు?

**విజయసాయిరెడ్డి పలు విషయాల్లో అత్యుత్సాహం చూపుతారు. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టడం లేద, ట్వీట్ చేయడం అలవాటు చేసుకున్నారు. లేనిపోని దానికి వివాదాలు సృష్టించడం విజయసాయిరెడ్డికి అలవాటుగా మారింది. ఇప్పుడు బుధవారం ఎవరు అడగకుండానే విజయసాయి రెడ్డి ఈ ప్రకటన చేయడం ఏప్రిల్ మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అప్పటికి కరోనా తగ్గుతుంది అని చెప్పడం చూస్తే ఆయన కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారా అనిపిస్తుంది. అడగని విషయానికి ప్రతిదానికి ఎందుకు ఎక్కువగా రియాక్ట్ అవుతారో వైసిపి నాయకులు కే అంతుపట్టని విషయం. అసలు ఏదైనా ఉంటే కనీసం ముఖ్యమంత్రి జగన్ ను సంప్రదించి అయినా ఈ వ్యాఖ్యలు చేయాల్సి ఉందని అసలు సంబంధం లేని విషయం లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని కొందరు వైసీపీ నాయకులు చిర్రుబుర్రులాడుతూ ఉన్నారు. ఎన్నికల తేదీలు నిర్వహణ అంతా చూసుకునేది ఎన్నికల కమిషన్ కదా? విజయసాయిరెడ్డి ఇప్పుడు తేదీలు నెలలు ప్రకటించడం స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేలా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

కోర్టు దిక్కరణ కాదా??

**ప్రస్తుతం స్థానిక సంస్థల వివాదం కోర్టులో ఉంది. హైకోర్టులో గత మూడు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు జగన్ కు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతం హైకోర్టు రాజ్యాంగ సంక్షోభం రాకూడదని మధ్యవర్తిత్వం వహించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కూడిన ఒక కమిటీని నిమ్మగడ్డ రమేష్ వద్దకు పంపాలని ఆయన ను ఒప్పించి లేదా ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కు స్థానిక సంస్థలు ఎప్పుడు జరపాలి లేదు అన్న విషయం పూర్తిగా ఆయన పరిధిలో ఉంటుంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర శాసనసభ సైతం తీర్మానం చేసి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కరోనా ఎక్కువగా ఉందని ఉందని చెబుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు సైతం పక్కన పెడుతూ ఎన్నికల నిర్వహణ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం అయిపోయిన తర్వాతే నిర్వహిస్తామని కోణంలో ఉంది. దీనిపై రోజు వివాదం నడుస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డి ప్రకటన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేది. అందులోనూ విచారణలో ఉన్న విషయం మీద విజయసాయిరెడ్డి ఎలా ప్రకటన చేస్తారని ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ అవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మీద మంట మీద ఉన్న హైకోర్టు దీనిని సైతం సుమోటోగా తీసుకొని.. విజయసాయిరెడ్డికి నోటీసు ఇస్తే అనవసరంగా ఇరుక్కుంటారా అన్నది న్యాయ నిపుణుల సూచన.

author avatar
Comrade CHE

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?