NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ఫుల్ సేఫ్‌లో ఉందా… ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్ ఇది..!

Is YCP in full safe This is a secret that no one knows

వైసీపీ ఆశ‌లు ప‌దిలంగానే ఉన్నాయి. ఒక‌వైపు.. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన కూట‌మిగా రంగంలోకి దిగుతున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయంగా మార్పు ఖాయ‌మ‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇదే విష‌యాన్ని ప‌లు స‌ర్వేలు కూడా చెబుతున్నాయి. ఎన్డీయే కూట‌మి క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నాయి. అయితే.. వైసీపీ నేత‌ల ఆశ‌లు వేరేగా ఉన్నాయి. పిలిచి మ‌రీ ప‌థ‌కాలిచ్చాం.. మ‌మ్మ‌ల్ని వ‌దులుకుంటా రా? అంటూ.. నాయకులు భరోసా వ్య‌క్తం చేస్తున్నారు.

ఒక‌ర‌కంగా ఇది కూడా వాస్త‌వమే. నిజానికి వైసీపీ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేసింది. అర్హులైన వారికి నేరు గా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు మంజూరు చేసింది. అయితే.. ఏదైనా కారణంగా కొంద‌రు అర్హులైన వారు ప‌థ‌కాలు అందుకోక‌పోతే.. వారిని కూడా లెక్క‌గ‌ట్టి.. ఏటా డిసెంబ‌రులో అన్ని ప‌థ‌కాల‌కు సంబంధిం చి అర్హులైన వారికి నిధులు వేస్తున్నారు. ఇది ఎక్క‌డా అమ‌లు కావ‌డం లేదు. అంటే.. ఏ రాష్ట్రంలోనూ ఇలా అమలు చేయ‌డం లేదు. ఏదైనా ప‌థ‌కానికి అర్హులైతే.. ఆ ప‌థ‌కానికి సంబంధించి నిర్ణీత గ‌డ‌వులో వారికి నిధులు ఇస్తున్నారు.

ఈ గ‌డువు దాటిపోతే..అర్హులైన వారు ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ, వైసీపీ ప్ర‌భుత్వం అర్హులై న వారు ఏ ఒక్క‌రూ మిగిలిపోకూడ‌ద‌నే ఉద్దేశంతో డిసెంబ‌రులో అన్ని ప‌థ‌కాల్లోనూ అర్హులై ఉన్న వారు.. అప్ప‌టి వ‌ర‌కు ఆయా ప‌థ‌కాల నిధులు అందుకోలేక పోతే.. వారికి ఒకేసారి నిధులు ఇస్తోంది. సో.. వైసీపీ నేత‌లు ఏం చెబుతున్నారంటే.. స‌మాజంలో ఏ ఒక్క అర్హులైన వారినీ తాము వ‌దిలి పెట్ట‌లేద‌ని, కాబ‌ట్టి త‌మ‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని అంటున్నారు. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది చూడాలి.

మ‌రోవైపు వైసీపీ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌నే దాదాపు టీడీపీ కూడా సూప‌ర్ సిక్స్ పేరుతో ప్ర‌క‌టించింది. వీటిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తోంది. దీంతో ప్ర‌జ‌లు కూడా వాటికి మొగ్గు చూపించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం అనే కాన్సెప్టుకు మ‌హిళా ఓటు బ్యాంకు ఫిదా అవుతోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో ఎలానూ అమ‌ల‌వుతున్న ఈ ప‌థ‌కంతో.. అక్కడిమ‌హిళ‌లు.. ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఏపీలోనూ ఇలాంటి ప‌థ‌కం వ‌స్తే బాగుంటుంద‌ని అనుకున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇది క‌నుక బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. వైసీపీకి ఇబ్బంది త‌ప్పేలా లేదు. అందుకే.. ఇప్పుడు వైసీపీ నాయ‌కులు.. కొత్త మాట మాట్లాడుతున్నార‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju