NewsOrbit
న్యూస్

నెతన్యాహు రికార్డు!

జెరూసలెం:  ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రికార్డు సృష్టించారు. తీవ్రమైన పోటీ ఎదురైనా కూడా రికార్డు స్థాయిలో ఐదోసారి ఆయన అధికారం చేపట్టారు. ప్రతిపక్ష నాయకుడు బెన్నీ గాంట్జ్ నుంచి గట్టి పోటీ ఉన్నా ఆయన ఎన్నికలలో విజయం సాధించారు. కడపటి వార్తలు అందేసరికి 97 శాతం ఓట్లు లెక్కించినా, అధికారం చేపట్టేందుకు కావల్సిన మెజారిటీ ఇద్దరిలో ఎవరికీ రాలేదు. కానీ ఇప్పటికే నెతన్యాహుకు కొన్ని పార్టీల మద్దతు ఉండటంతో వాటి సాయంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటుచేసే అవకాశం స్పష్టంగా ఉంది.

నెతన్యాహుపై ఇటీవల అవినీతి ఆరోపణలు రావడంతో, ఈ ఎన్నికలను రిఫరెండంగా అందరూ భావించారు. ఆయనపై మూడు కేసులు పెండింగులో ఉన్నాయి. కానీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని నెతన్యాహు ఖండిస్తూ వచ్చారు. ఆయనకు చెందిన లికుడ్ పార్టీ, గాంట్జ్ ప్రాతినిధ్యం వహించే బ్లూ అండ్ వైట్ పార్టీ రెండింటికీ తలో 35 స్థానాలు వచ్చాయి. లికుడ్ పార్టీకి మరో ఐదు స్థానాలు లభించినట్లయింది.

ఇది బ్రహ్మాండమైన విజయమని తన మద్దతుదారులతో లికుడ్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అర్ధరాత్రి సంబరాలలో నెతన్యాహు (69) అన్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చేవరకు సంయమనం పాటించాలని కోరారు. ఫలితాలు సానుకూలంగా రావడంతో ఆయన భార్య సారా నెతన్యాహుకు ముద్దివ్వగా వెనక టపాసులు పేల్చారు. ఇజ్రాయెల్ తుది ఫలితాలు శుక్రవారం నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంది. 71 ఏళ్ల ఇజ్రాయెల్ చరిత్రలో సుదీర్ఘకాలం పాలించిన ప్రధాని ఆయనే అవుతారు. 2009 నుంచి వరుసగా ఆయనే అధికారంలో ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో తాము గెలిచామని ప్రతిపక్ష నేత రివల్ గంట్జ్ అంటున్నారు. ఇన్నాళ్లూ జాతికి సేవ చేసినందుకు నెతన్యాహుకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

Leave a Comment