NewsOrbit
జాతీయం న్యూస్

Gaganyaan: ఆరంభంలో అవాంతరం ఎదురైనా గగన్‌యాన్ టీవీ – డీ 1 పరీక్ష సక్సెస్

Share

Gaganyaan: గగన్‌యాన్ మిషన్ లో కీలకమైన తొలి దశ ప్రయోగం టీవీ – డీ 1 (టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ -1) సాంకేతిక లోపం కారణంగా ఆఖరి నిమిషంలో అకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక లోపంతో టెస్ట్ వెహికిల్ ఆగిపోయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించగా..శాస్త్రవేత్తలు సాంకేతిక లోపం ఎక్కడనే విషయాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు వెంటనే సరిచేశారు. గంటల వ్యవధిలోనే ప్రయోగం ఎప్పుడనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ఇస్రో ప్రకటించింది.

ఉదయం పది గంటలకు శ్రీహరికోట నుండి సింగిల్ స్టెక్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఆ తర్వాత రాకెట్ నుండి విడిపోయిన క్రూ మాడ్యూల్.. సురక్షితంగా పారాచుట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై దిగింది. గగన్ యాన్ వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల .. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. గగన్ యాన్ టెస్ట్ లాంచ్ సక్సెస్ అయ్యిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. టీవీ – డీ 1 మిషన్ ను విజయవంతంగా పరీక్షించామని, వ్యోమగాముల భద్రతకు సంబంధించి వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగామని తెలిపారు. పది గంటలకు రాకెట్ ప్రయోగించగా నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకువెళ్లింది. మరో నాలుగైదు గంటల తర్వాత క్రూమాడ్యూల్ భూమికి చేరుకోనున్నది.

రాకెట్ నింగిలోకి బయల్దేరిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తుల అబార్ట్ సంకేతాన్ని పంపారు. దీంతో రాకెట్ పై భాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలో మీటర్ల ఎత్తులో .. క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుండి వేరు చేశాయి. 17 కిలో మీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు విచ్చుకున్ని. సెకనుకు 8.5 కిలో మీటర్ల వేతంతో క్రూ మాడ్యూల్.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని ..531.8 సెకన్లలో (8.85 నిమిషాల్లో) పూర్తి చేశారు.

గగన్ యాన్ ముందు ఇస్రో నాలుగు పరీక్షలు నిర్వహించాలని అనుకుంది. ఇందులో టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (టీవీ –డీ 1) మొదటిది. 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ అది పరిమిత స్థాయిలోనే జరిగింది. ఈ సారి దాదాపు పూర్తి స్థాయిలో సిద్దమైన హ్యోమనౌకను పరీక్షిస్తున్నారు. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్దమవుతుంది.  ఇందులో క్రూ (హ్యోమగాముల) ఎస్కేప్ సిస్టమ్ సమర్థన, క్రూ మాడ్యూల్ పనితీరు, హ్యోమనౌక ను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే మాడ్యూల్ ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షిస్తుంది.

కాగా, ప్రయోగానికి సిర్వం సిద్దమై.. ఇక ప్రయోగించడమే తరువాయి అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు హోల్డ్ చేశారు. కేవలం అయిదు సెకన్లలో నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా కొద్దిపిట మంటలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులు ఆదేశాలతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రయోగాన్ని  చూడటానికి పెద్ద సంఖ్యలు ప్రజలు, విద్యార్ధులు ఇస్రోకు చేరుకున్నారు. మరో వైపు లక్షలాది మంది ప్రజలు, ఔత్సహికులు టీవిలకు, యూట్యూబ్ లకు అతుక్కుపోయారు.

Gaganyaan ISRO: గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ ప్రయోగంలో సాంకేతిక లోపం .. చివరి నిమిషంలో హోల్డ్ చేసిన ఇస్రో


Share

Related posts

బ్రేకింగ్ : విడుదల కి సిద్ధమైన రవితేజ ‘క్రాక్’..! ఇక లాభాలే లాభాలు

arun kanna

ఒకేసారి లక్షమందితో హనుమాన్ చాలీసానా?  అది కూడా…

sekhar

రాముడిగా ప్ర‌భాస్.. ట్రెండ్ అవుతున్న సరికొత్త లుక్!

Teja