జాబిల్లిపై పరిశోధనకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ల్యాండర్ విక్రమ్ మాడ్యూల్ నుండి బయటకొచ్చిన రోవర్ .. చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతోంది. ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు పంపుతోంది. ఒక వైపు ఇలా చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతంగా సాగుతుంటే.. మరో వైపు ఈ ప్రయోగం దెబ్బకు రికార్డులు బద్దలవుతున్నాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ – 3 ల్యాండర్ విక్రమ్ మాడ్యూల్ సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత .. ‘నేను నా లక్ష్యాన్ని చేరుకున్నా’ అంటూ చంద్రయాన్ – 3 పంపిన సందేశాన్ని ఇస్రో ట్వీట్ చేసింది. ఇస్రో చేసిన ఈ ట్వీట్ కు అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
అలాగే దేశంలోనే అత్యధిక లైక్స్ (800K) పైగా వచ్చిన ట్వీట్ గా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఇస్రో చంద్రయాన్ – 3 ట్వీట్. ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కొహ్లీ పేరిట ఉంది. టీ 20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ తో మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ తో టీమిండియా గెలిపించాడు విరాట్ కొహ్లీ. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ .. ఇలా 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాని.. వీరోచిత పోరాటంతో గెలుపు బాట పట్టించాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన విరాట్ కొహ్లీ, కేరీర్ బెస్ట్ టీ 20 ఇన్నింగ్స్ తో టీమిండియాకి సంచలన విజయం అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత స్పెషల్ విన్. వేల సంఖ్యలో విచ్చేసిన అభిమానులకు థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కొహ్లీ. ఈ ట్వీట్ కు 796 కే లైక్స్ వచ్చాయి. ఇండియాలో అత్యధిక లైక్స్ రాబట్టిన ట్వీట్ గా నిలిచిన విరాట్ కొహ్లీ ట్వీట్ ని ఇస్రో ట్వీట్ అధిగమించి రికార్డును బ్రేక్ చేసింది.
విరాట్ కొహ్లీ లైక్డ్ ట్వీట్ రికార్డు బ్రేక్ కాకూడదని ఇస్రో ట్వీట్ ని ఫ్యాన్స్ ఎవ్వరూ లైక్ చేయవద్దని కొందరు కొహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇస్రో చంద్రయాన్ – 3 ప్రయోగానికి సోషల్ మీడియా ప్రపంచం దాసోహం అవ్వడంతో విరాట్ కొహ్లీ రికార్డు మూడు రోజుల్లోనే బ్రేక్ అయిపోయింది. మరో పక్క సోషల్ మీడియాలో దీనిపై భిన్న వాదనలు వినబడుతున్నాయి. ఇలా కంపేర్ చేయడం కరెక్టు కాదని కూడా అంటున్నారు. ఏ రికార్డు అయినా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ కావాల్సిందేననీ, దేశం కంటే ఏ ఒక్క వ్యక్తి కూడా గొప్పవాడు కాదని అంటున్నారు.
మరో పక్క యూట్యూబ్ లో ఎక్కవ మంది ప్రత్యక్ష ప్రసారాలలో వీక్షించిన ఈవెంట్ గా చంద్రయాన్ – 3 చరిత్ర సృష్టించింది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రత్యక్ష ప్రసారాలను యూట్యూబ్ లో 8.06 మిలియన్ల మంది వీక్షించారు. గతంలో బ్రెజిల్ – దక్షిణ కొరియా మాధ్య జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ ను 6.15 మిలియన్ల మంది వీక్షించారు.
Amit Shah: కేసీఆర్ ను ఇంటికి పంపి.. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం – అమిత్ షా
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
— ISRO (@isro) August 23, 2023