అనిల్ రావిపుడి కి పరమ బ్యాడ్ టైం అంటే ఇదేనేమో ..?  

Share

టాలీవుడ్ లో రాజమౌళి, కొరటాల శివ తర్వాత మళ్ళీ సకస్ ఫుల్ డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మొదటి సినిమా నుంచి ఈ ఇయర్ ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో వచ్చిన సరిలేరు నీకెవ్వరు వరకు అన్ని సూపర్ హిట్స్ ని ఇచ్చాడు. కళ్యాణ్ రాం, సాయి ధరం తేజ్, రవితేజ, వెంకటేష్..వరుణ్ తేజ్ ..ఇలా అనిల్ రావిపూడి తను చేసిన హీరోలందరికీ హిట్స్ ఇచ్చాడు. చెప్పాలంటే రవితేజ కి ఫాపుల్లో ఉంటే రాజా ది గ్రేట్ సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. ఇక వెంకటేష్ వరుణ్ తేజ్ లతో తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎఫ్2 100 కోట్ల కి పైగా వసూళ్ళని సాధించింది.

 

దాంతో టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ అనిల్ రావిపూడి తో సినిమా చేయాలనుకున్నారు. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు సినిమాని అవకాశం ఇచ్చాడు. అదే సమయంలో ఎఫ్ 3 లో నటిస్తానంటూ మాటిచ్చాడు కూడా. కాని ఎందుకనో అనిల్ రావిపూడికి హీరోలు దొరకడం లేదు. మాటిచ్చిన మహేష్ బాబు వేరే ప్రాజెక్ట్ కమిటయ్యాడు. ఎఫ్ 2 కి సీక్వెల్ చేద్దామనుకుంటే వెంకీ వరుణ్ లు చెరొక ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఎఫ్3 గురించి మాట్లాడే అవకాశమూ ఇవ్వడం లేదట.

ఎలాగైనా ఎఫ్ 3 పట్టలెక్కిద్దామని సన్నాహాలు చేసుకుంటే అది ఈ సంవత్సరం సాధ్యపడేలా కనిపించడం లేదు. ఆ మధ్య బాలయ్య తో రామారావు అన్న టైటిల్ తో సినిమా చేస్తాడన్న ప్రచారం జోరుగా జరిగింది. కాని అందులో వాస్తవం ఏంటో ఇంత వరకు ఎవరూ వెల్లడించలేదు. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ని లాంచ్ చేసే బాధ్యత బాలయ్య అనిల్ రావిపూడికి అప్పగించారని వార్తలు వచ్చాయి. కాని ఇది కూడా వాస్తవం కాదని అంటున్నారు. మరి ఇలాంటి ప్రచారాలు వినడానికి బాగానే ఉన్నా అసలు విషయం మాత్రం ఒకటే ప్రస్తుతం అనిల్ రావిపూడి కి ఏ హీరో అందుబాటులో లేరని. మరి అనిల్ మీద ఏ ప్రభావం ఇంతగా పడిందో తెలియడం లేదు.


Share

Related posts

ఇక డీజిల్, పెట్రోల్ ధరలను స్వస్తి..! పాట్నాలో ప్రయోగం అదుర్స్..!!

bharani jella

Poll : ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై స్పీకర్ ఓ ప్రకాష్ బిర్లా వేటు వేస్తారని మీరు అనుకుంటున్నారా…? లేక వైసీపీ వేసిన పిటిషన్ ని కొట్టేస్తారా…?

ramu T

బాధ్య‌త మ‌రింత పెరిగింది

Siva Prasad