Sathyadev : సత్యదేవ్ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోగా మారాడు. జ్యోతిలక్ష్మీ, ఘాజీ లాంటి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఇందులో రామ్ తో పాటు నటించి సెకండ్ హీరో రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. సత్యదేవ్ లో ఉన్న టాలెంట్‌కి టాలీవుడ్ మేకర్స్ మంచి అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సత్య దేవ్ చేతినిండా ఇప్పుడు క్రేజీ మూవీ ఆఫర్స్ ఉన్నాయి. తిమ్మరసు అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో టాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలోని పోస్టర్స్ రిలీజై ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అలాగే గాడ్సే అనే సినిమాలో చేస్తున్నాడు. దీనితో పాటే మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం అనే మరో సినిమాను చేస్తున్నాడు. అలాగే స్కయ్ ల్యాబ్ అనే మరో సినిమాలో కూడా చేస్తున్న ఈ యంగ్ హీరోకి బాలీవుడ్లో ఏకంగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయం. ఇందులో సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
Sathyadev : ‘రామ్ సేతు’లో నటించే అవకాశం రావడం అసలు ఊహించలేదని సత్యదేవ్ తెలిపాడు.
అయితే ఇటీవలే బాలీవుడ్లో నటించే అవకాశం రావడం అసలు ఊహించలేదని సత్యదేవ్ తెలిపాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ‘రామ్ సేతు’ సినిమాలో వచ్చిన అవకాశం గురించి సత్యదేవ్ స్పందిస్తూ.. ‘కొన్ని విషయాలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయని’ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?