Saturday: మనం చేసే కొన్ని పనుల వల్ల
శనీశ్వరుడుసూర్యు భగవానుడి,ఛాయాదేవి ల సంతానం, నవగ్రహాల్లో ఒకరుగా పూజిస్తాం. గ్రహాల సంచారం బట్టి ఒక్కొక్కరిపై శనిప్రభావం వేరు వేరు స్థాయి లో ఉంటుంది. శని దశ నడుస్తున్నప్పు మాత్రమే కాదు ప్రతి రోజు మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా ఆయన ప్రభావం మన మీద పడుతుంది. మరీ ముఖ్యంగా శనివారం రోజు కొన్ని వస్తువులుకొనడం కానీ చేతికి అందుకోవడం వంటివి చేయకూడదు.
Saturday: ఇనుముతో చేసిన వస్తువులు
శనివారం రోజు ఇనుముతో చేసిన వస్తువులు కొనడం వలన అస్సలు కలసి రాదట. వ్యాపారులైతే లాభం మాట ఎలా ఉన్న నష్టాలు వస్తాయట.శనివారం రోజు నువ్వుల నూనె,నువ్వులను కొనకూడదు, ఎవ్వరి చేతి నుంచీ తీసుకోకూడదు. అలా చేయడం వలన అలా చేయడం వలన ప్రత్యక్షం గా శనీశ్వరుని ఇంటికి తీసుకువచ్చినట్లు అవుతుంది. శనీశ్వరుడు కి నువ్వులంటే అత్యంతఇష్టమైనవి.. అలాంటి వాటిని చేతికి అందుకోవడం, కొనడం వంటివి చేస్తే శనిదేవుడిని ఆహ్వానించినట్టు అవుతుంది. శనివారం ఆవాలతో వండుకోవడం , ఆవ నూనె వాడడం వంటివి చేయకూడదు.శనివారం రోజు నల్లని బట్టలు , నల్లని గాజులు, నల్లని షూ లాంటివి కొనుక్కోకూడదు… వేసుకోకూడదు.
సిరి సంపదలు
శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం తో పాటు నువ్వులను నైవేద్యం గా పెట్టడం వలన మరియు నల్లని వస్త్రాన్నిమాలగా అలంకరించి పూజించడం వలన అష్ట దరిద్రాలు పోయి సుఖశాంతుల తో పాటు సిరి సంపదలు పొందవచ్చు.
శనివారం రోజు ఆవాలు కొన్నా, ఎవరినైనా అడిగి తెచ్చినా ఎన్ని ఆవాలు తీసుకున్నామో అన్ని సమస్యలు వచ్చిపడతాయి.
అలాగే ఉప్పు, మిరియాలు, వంకాయలు వంటివి కొనడం లేదా ఎవరిదగ్గరయినా తీసుకోవడం వంటివి చేయకూడదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?