Puri jagannaath: పూరి జగన్నాథ్‌లా బ్రతకడం ఇండస్ట్రీలో చాలా కష్టం..నిజంగానే ఆయనకంటే తోపెవ్వడు లేడిక్కడ

Share

Puri jagannaath: చిన్నప్పటి నుంచి ఇంట్లో పుస్తకాలను చదవడం అలవాటు చేసుకున్న పూరి జగన్నాథ్ అలాగే కథలు రాయడం అలవాటు చేసుకున్నాడు. ఆయన కథలను చూసి బావుంది లేదు అని చెప్పే విమర్శకుడు, ప్రశంసకుడు ఆయన తండ్రే. ఏదన్నా చిన్న కథ రాసి దాన్ని పుస్తకాల మధ్యలో పెట్టేవాడు పూరి. అది చదివిన వాళ్ళ నాన్నగారు బావుంది లేదా బాగోలేదు అని ఒకమాట రాసి మళ్ళీ అక్కడే పెట్టేవారు. అలా పూరి కథలకి అప్రిసియేషన్స్ గాని విమర్శలు గానీ ఇంట్లో నుంచే మొదలయ్యాయి. వీరికి ఓ సినిమా థియోటర్ ఉండేది.

it is difficult to live like puri-jagannaath-in industry
it is difficult to live like puri-jagannaath-in industry

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్. రోజూ స్కూల్ నుంచి వచ్చిన పూరి ఫస్ట్ షో సెకండ్ షో చూసి తిరిగి తండ్రితో ఇంటికి వచ్చేవాడు. అలా సినిమాల మీద బాగా ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తిని గమనించిన పూరి తల్లిదండ్రులు 25 వేలు ఇచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళితే బాగుపడతావని చెప్పారు. ఇది పూరి ఊహించలేదు. సినిమా ఇండస్ట్రీకి వెళతానంటే ఏ అమ్మా నాన్నలు ఒప్పుకోరు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. అమ్మా నాన్నలే డబ్బిచ్చి పంపారు. ఇక్కడే పూరి సక్సెస్ మొదలైందని చెప్పాలి.

Puri jagannaath: పవన్ కళ్యాణ్  నమ్మి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం.

అలా ఇండస్ట్రీకొచ్చిన పూరి కొంతకాలం సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ దగ్గర అసోసియేట్‌గా చేశాడు. ఆ తర్వాత ఓ టీవీ సీరియల్ చేశాడు. ఈ సమయంలో సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడు – ఛోటా కె నాయుడుల ద్వారా పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పే అవకాశం అందుకున్నాడు. అలా ఇద్దరి కాంబినేషన్‌లో బద్రి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. మంచి స్టార్ డం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్  నమ్మి అవకాశం ఇవ్వడం కూడా ఇక్కడ గొప్ప విషయం. ఈ సినిమా తర్వాత బాచి, కన్నడలో యువరాజ, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అప్పు, ఇడియట్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్‌గా మారాడు.

ఆ తర్వాత అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమా పూరి రేంజ్ మార్చేసింది. వైషో అకాడమి నిర్మాణ సంస్థలో ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి లాంటి సినిమాలతో అటు నిర్మాతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతో నాగార్జునతో శివమణి సినిమా చేసే అవకాశం అందుకున్న పూరి భారి హిట్ ఇచ్చాడు. అయితే జూనియర్ ఎన్.టి.ఆర్ తో తీసిన ఆంధ్రావాలా భారీ డిజాస్టర్ కావడంతో పూరికి వచ్చిన క్రేజ్ అమాంతం పడిపోయింది. అదే సమయంలో నమ్మిన స్నేహితుడు మోసం చేయడంతో దాదాపు ఓ 100 కోట్ల వరకు నష్టపోయాడు.

Puri jagannaath: మరో దర్శకుడైతే ఇక బ్రతకడం దండగ అని ఇండస్ట్రీ వదిలేసేవాడు.

ఆయన పెంచుకునే కుక్కలకి కూడా ఫీడింగ్ ఇవ్వలేని స్థితికి దిగిపోయాడు. ఉన్న ఆస్థులన్నీ పోయి రోడ్డున పడిన పూరి మళ్ళీ కెరీర్ జీరో నుంచి మొదలు పెట్టాడు. ఆ సమయంలో మరో దర్శకుడైతే ఇక బ్రతకడం దండగ అని ఇండస్ట్రీ వదిలి ఎక్కడో అడ్రస్ లేకుండా జీవిస్తుండేవాడు. కానీ పూరి అలాకాదు ఇవన్నీ జనాలు ఇచ్చిన ఆస్థులు..వారిచ్చిన పాపులారిటీ. మళ్ళీ సంపాదించుకుందాం అని కసితో మళ్ళీ కెరీర్ ప్రారంభించాడు. తమ్ముడిని హీరోగా పెట్టి 143 సినిమా తీసి హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత నుంచి వరుసగా హిట్స్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా పూరి బెదిరింది లేదు.

పడి లేచిన కెరటంలా వరుసగా స్టార్స్ తో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వరుస ఫ్లాప్స్‌తో కెరీర్ డైలమాలో పడ్డ సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు అందరికంటే తక్కువ బడ్జెట్‌తో లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సహ నిర్మాతలుగా ఛార్మి, బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ వ్యవహరిస్తున్నారు.


Share

Related posts

Corona: ఏపీలో క‌రోనా క‌ల‌క‌లం … మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar

Varalaxmi Sarathkumar : టాలీవుడ్‌కి దొరికిన వెర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్‌కుమార్..హీరోయిన్ పాత్రల కోసం వెంపర్లాడకపోవడం ఆమె గొప్పతనం

GRK

ఆ మంత్రిని వ‌దిలిపెట్టొద్దు… టీడీపీ కొత్త ఫోక‌స్‌

sridhar