ఎఫ్ 3 .. ఎఫ్ 2 కి సీక్వెల్ గా సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరున్ తేజ్ హీరోలుగా తమన్నా – మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. f 2 100 కోట్ల పైగా వసూళ్ళు సాధించడంతో dil raju – anil ravipudi ఈ సీక్వెల్ మరింత సక్సస్ ని సాధించాలని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.
కాగా ఇప్పటికే f 3 ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజై సినిమా మీద అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ కథ డబ్బు నేపథ్యంలో సాగుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్స్లోనే వెల్లడించాడు anil ravipudi. అంతేకాదు ఈ సినిమా కన్ఫ్యూజన్ కథతో సాగుతుందని, అందులో నుంచి పుట్టుకొచ్చే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే మూడవ క్యారెక్టర్ ఉండగా.. ఎవరు నటిస్తారన్నది ఇంకా వెల్లడి కాలేదు. అయితే ముందు నుంచి మాస్ మహారాజ రవితేజ నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.
రీసెంట్ గా మూడవ పాత్రలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నట్లు టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ మూడవ పాత్రకి ఒకప్పటి స్టార్ కమెడియన్ అండ్ హీరో సునీల్ పేరు వినిపిస్తోంది. అయితే ఇంకా ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు. ఈ మధ్య హీరోగా కాస్త జోరు తగ్గిన sunil మళ్ళీ కామెడి పాత్రలని చేస్తూ క్రేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. అప్పుడప్పుడు విలన్ పాత్రలో కూడా నటించి మెప్పిస్తున్నాడు. మరి నిజంగా f 3 లో sunil నటిస్తే తన కెరీర్ కి ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువ.