టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా రెండవ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమానే విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ తో పాటు మంచి కలెక్షన్స్ తో హిట్ గా నిలిచింది. దాంతో శైలేష్ కొలను నెక్స్ట్ ‘హిట్ 2’ కూడా తీస్తానని ప్రకటించాడు. అయితే ఆ సినిమా కి నిర్మాత నాని నా కాదా అన్నది మాత్రం వెల్లడించలేదు. ఈలోపే రాజ్ కుమార్ రావ్ హీరోగా హిట్ హిందీ రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం శైలేష్ కొలనుకు దక్కింది.
ఒరిజినల్ వెర్షన్ ని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వంలో నటించడానికి రాజ్ కుమార్ రావ్ కూడా ఆసక్తి చూపించాడు. అంతేకాదు రాజ్ కుమార్ రావ్ హిట్ హిందీ రీమేక్ లో నటిస్తున్నట్లు కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే జెర్సీ మూవీని షాహిద్ కపూర్ తో హిందీలో రీమేక్ చేస్తున్న దిల్ రాజు మరో నిర్మాత కుల్దీప్ రాథోడ్ తో కలిసి హిట్ మూవీ నిర్మిస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలని దిల్ రాజు బాలీవుడ్ లో నిర్మించడం హాట్ టాపిక్ గా మారింది కూడా.
ఇక హిట్ సినిమాతో దర్శకుడు శైలేష్ కొలను ప్రేక్షకుల్లో కూడా మంచి అభిప్రాయాన్ని దక్కించుకున్నాడు. అయితే తెలుగు ప్రేక్షుకులకు హిట్ లాంటి కాన్సెప్ట్ తో వచ్చిన కాస్త కొత్త కాబట్టి ఆకట్టుకుంది. కానీ హిందీ ప్రేక్షకులకు హిట్ లాంటి థ్రిల్లర్ సినిమాలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి… భారీ సక్సస్ ని సాధించాయి. ఈ క్రమంలో హిట్ బాలీవుడ్ జనాలకి ఎక్కుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు కొందరిలో మొదలయ్యాయట. అంతేకాదు ఇక్కడ సక్సస్ అయినంత మాత్రాన ఇలాంటి రెగ్యులర్ సినిమాని అక్కడ తీసి హిట్ హిట్టడం అంటే ఆలోచించాల్సిందే అంటూ తమ అభిప్రాయాలను చెబుతున్నట్టు తెలుస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?