న్యూస్ సినిమా

29 రోజుల్లో తీస్తే..500 రోజులు ఆడింది.. చిరంజీవి సత్తా చాటిన సినిమా అది!

Share

ఇప్పుడంటే హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, విదేశాల్లో పాటలు చిత్రీకరించడం వల్ల సినిమాలు పూర్తి చేయడానికి సంవత్సరాల కొద్దీ సమయం పడుతోంది. సరైన కథలు లేకుండా ఎక్కువగా పై మెరుగులకే పరిమితమవుతున్నారు ఈతరం దర్శకులు. ఇంకా పాన్ ఇండియాకి తగ్గ సినిమా అంటూ అన్నిటినీ చాలా సమయం తర్వాత రిలీజ్ చేస్తున్నారు. అయితే 1982లో రిలీజ్ అయిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా షూటింగ్ పనులన్నీ జస్ట్ 29 రోజుల్లోనే పూర్తయింది. కోడి రామకృష్ణ తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇది 500 రోజులకు పైగా థియేటర్లలో ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. డైరెక్టర్‌గా కోడి రామకృష్ణకు, నటుడిగా, రచయితగా గొల్లపూడి మారుతీ రావుకు ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. అలా ఫస్ట్ డైరెక్టోరియల్‌తోనే కోడి రామకృష్ణ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

512 రోజులు ఆడి చిరంజీవి సత్తా చాటింది

ఈ చిత్రం 1982 ఏప్రిల్ 23 న విడుదల కాగా దీనికి ఇప్పటికే 40 ఏళ్లు నిండాయి. ఈ సినిమాకి మొదట ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కానీ సినిమా బాగుంది బాగుంది అని చూసినవారు అంటుంటే.. కాలక్రమేణా థియేటర్లకు భారీ ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. అలా 100 రోజులు ఆడింది. ఆపై 200, 300.. ఇలా సినిమా ఏకంగా 512 రోజులు ఆడింది. అప్పటికే యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న చిరంజీవి అనే కామెడీ పుటించే ఫ్యామిలీ పాత్రలో మెప్పించడం అనేది అంత చిన్న విషయం కాదు.

మూవీ విశేషాలు

చిరంజీవి కెరీర్‌లోని అన్ని సినిమాల్లోకీ ముందు మనసులో ఉంటుంది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా. చిరంజీవి సరసన జయ పాత్రలో మాధవి నటించింది. ఈ చిత్రంలో పూర్ణిమ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో అమాయక ఆడపిల్లలను మాటలతో మాయచేసి జల్సా చేసే సుబ్బారావు పాత్రలో గొల్లపూడి నటించారు. ఈ మూవీ షూటింగ్‌ని రూ.3.20 లక్షలు ఖర్చు చేసి పాలకొల్లు, నర్సాపురం, పోడూరు, సఖినేటిపల్లి, భీమవరం, మద్రాస్ లో పూర్తి చేశారు. ఈ సినిమాలోని పాటలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీ. సుశీల గానం పాడారు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కోడి రామకృష్ణ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకొనే పరిస్థితి రాకుండా ముందుకు కొనసాగారు.

 


Share

Related posts

ర‌జ‌నీ @168

Siva Prasad

పాక్ డ్రోన్ కాల్చివేత

sarath

Theri Movie: ఒకే కథతో పవన్ కళ్యాణ్ – వరుణ్ ధావన్..!

GRK