25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను శాఖ దాడుల కలకలం.. వాళ్లే లక్ష్యంగా..?

Share

తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఆదాయపన్ను (ఐటీ) శాఖ దాడులు కలకలం రేపాయి. హైదరబాద్ నగరంలోని పలు రియల్ సంస్థల లక్ష్యంగా చేసుకుని ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. గూగి గ్లోబల్ ప్రాజెక్టు లిమిటెడ్, గుగి ఫౌండేషన్, విహాంగ చిట్ ఫండ్ ప్రైవేటు లిమిటెడ్, మెరిడియన్ డేటా ల్యాబ్స్ లిమిటెడ్, వండర్ సిటీ, ఇన్ గ్లోబల్ ప్రైవేటు లిమిటెడ్, హ్యాపీ హార్స్ ఎంటర్ ప్రైజెస్, రాయల్ సిటీ, ఫార్మా సిటీ తదితర సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. గూగి కంపెనీ అధినేత యూసిన్ ఫాతిమా నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి.

income_tax_dept

నగరంలోని 20 ప్రదేశాల్లో ఏకకాలంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తొంది. వ్యాపార లావాదేవీలు, ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉన్నందునే ఈ దాడులు చేపట్టినట్లుగా తెలుస్తొంది. మరో పక్క ఏపిలోని గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ప్రస్తుతం కనుమ అంజుమన్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీలను కనుమ చూసుకుంటుంటారు.


Share

Related posts

Yoga: తేలికగా వేసే ఈ ఆసనం తో త్వరగా బరువు తగ్గుతారు!!

Kumar

Thinking: వీటి గురించి  ఎప్పుడైనా ఆలోచించారా ?? ఆలోచించండి మంచి ఎనర్జీ వస్తుంది!!

siddhu

బాబు సొంత ఇలాకాలో వైసిపి దూకుడు..!!

sekhar