మంత్రి నివాసంలో ఐటి సోదాలు

నెల్లూరు: ఐటి అధికారులు మంత్రి నారాయణను టార్గెట్ చేశారు. మొత్తం అయిదు బృందాలుగా విడిపోయిన ఐటి శాఖ అధికారులు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో, మంత్రి నారాయణ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

నారాయణ మెడికల్ కాలేజీలో భారీగా డబ్బు ఉందన్న సమాచారంతోనే ఐటి దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో ఐటి దాడులు జరగడం పట్ల పార్టీ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఐటి దాడులపై మంత్రి నారాయణ గానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పదించలేదు.

మరోవైపు విజయనగరం జిల్లా చీపురుపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ నేడో, రేపో దాడులు జరిగే అవకాశముందని అనుమానం వ్యక్తం చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ దాడులు జరగడం కొసమెరుపు.