చెన్నైలో ఐటీ దాడులు

చెన్నైజ‌న‌వ‌రి3: చెన్నైలోని ఐదు ప్రముఖ రెస్టారెంట్‌ గొలుసు సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శరవణ భవన్‌, గ్రాండ్‌ స్వీట్స్‌, హాట్‌ బ్రీడ్స్‌, అంజాప్పర్‌ గ్రూప్‌తో పాటు మరో గొలుసు సంస్థ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని మొత్తం 32 చోాట్ల దాడులుకొన‌సాగుతున్నాయని  అధికారులు వెల్లడించారు. గొలుసు సంస్థలకు సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టామ‌ని ఐటీ ఆధికారులు అన్నారు. ఈ ఐదు సంస్థలు పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు.

గత కొన్నేళ్లుగా ఈ ఐదు సంస్థలు వేల కోట్లరూపాయ‌ల పన్ను ఎగవేసినట్లు మాకు సమాచారం వచ్చిందీ. దీనిపై విచారణ చేసిన తర్వాతే సోదాలు నిర్వహిస్తున్నాం’ అని ఐటీ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు వివ‌రించారు. దాడులు నిర్వహిస్తున్న శరవణ భవన్‌కు న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌, సింగపూర్‌తో పాటు ఇతర దేశాల్లోను అవుట్‌లెట్స్‌ ఉన్నాయని  ఐటీ అధికారి వెల్లడించారు