IT rules: సరికొత్త ఐటీ రూల్స్ ను ప్రవేశపెట్టిన కేంద్రం..!

Share

దేశంలోని పౌరులందరికీ భారత రాజ్యాంగం కొన్ని సమానత్వపు హక్కులను ఇచ్చింది. అందులో భావ ప్రకటన స్వేచ్చ కూడా ఒకటి. వీటికి అనుగుణంగా కేంద్రం కొత్తగా ఐటీ నిబంధనలను తీసుకొచ్చింది. వ్యక్తిగత గోప్యతకు, సమాచారం భద్రతకు ఈ రూల్స్ రక్షణ కల్పించనున్నాయి. చిన్నారులు, మహిళలుపై జరుగుతున్న ఇంటర్నెట్ దాడులు, సైబర్ మోసాల నుంచి కూడా రక్షణగా నిలుస్తాయని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తంగా ఎఫ్‌ఏక్యూలు ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల యూజర్లకు ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.


IT rules: సరికొత్త ఐటీ రూల్స్ ను ప్రవేశపెట్టిన కేంద్రం..!
కొత్త ఐటీ చట్టం 2021 ఏం చెబుతుందంటే..

కొత్త ఐటీ చట్టం 2021ను సోషల్ మీడియా వినియోగదారుల హక్కులకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. యూజర్స్‌ కు ఎలాంటి జరిమానాలు విధించవద్దని అందులో పేర్కన్నారు. యూజర్లు అందరికీ సమానత్వంతో పాటు ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ఈ చట్టం తెచ్చామని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కొందరు ఆన్‌లైన్ చాటింగ్, ఇతర కార్యక్రమాలకు మధ్యవర్తిగా నిలుస్తారని.. వాణిజ్య, ఇతర లావాదేవీలు ప్రారంభించడం, ఈ మెయిల్ సర్వీసులు, ఇంటర్నెట్ లేదా సెర్చింజన్ సేవలు, ఆన్ లైన్ స్టోరేజీ మొదలైన అంశాలకు ప్రాథమిక విషయాల్లో యాక్సెస్ ఉంటుందని తెలిపారు.

AP CM YS Jagan: ఆ సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు  సిద్ధం అవుతున్న సీఎం జగన్..

సోషల్ మీడియాను మధ్యవర్తిగా భావించలేం..

సోషల్ మీడియాను మధ్యవర్తిగా ఎన్నడూ పరిగణించలేమని 20 పేజీలతో కూడా పత్రాలను ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సోషల్ మీడియాలో పోస్టు అయిన అసభ్యకర కంటెంట్ ను తీసివేయాలని జారీ చేసే అధికారం చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ నోడల్ కాంటాక్ట్ పర్సన్‌కు ఉందని, నోడల్ కాంటాక్ట్ పర్సన్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ సేవలను ఒకే వ్యక్తి అందించవచ్చని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులకు మధ్యవర్తిగా ఉండే సోషల్ మీడియా(ఎస్‌ఎస్‌ఎంఐ) రెండు పోస్టుల కోసం వేర్వేరు వ్యక్తులను నియమించాలని తెలిపింది. న్యూడ్ పిక్స్ లేదా మార్ఫింగ్ ఫోటోలను ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లో సోషల్ మీడియా కంపెనీలు రిమూవ్ చేయాలి. ఈ రూల్ 50 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులున్న కలిగియున్న సామాజిక మాద్యమాలకు చెందిన సైట్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. సైబర్ వరల్డ్ డెవలప్మెంటుతో పాటు నేరాలు భారీగా పెరిగాయని.. జవాబుదారీతనం ఉన్నప్పుడే కస్టమర్ల సమాచారానికి భద్రత ఉంటుందన్నారు.


Share

Related posts

బీజేపీవి ప్రమాదకర విధానాలు: అఖిలేష్

Siva Prasad

Radhika Apte: రాధిక ఆప్టే అందుకే టాలీవుడ్‌లో సక్సెస్ కాలేదా..?

GRK

సడన్ గా లోకేష్, పవన్ కళ్యాణ్ పర్యటనలకు పెద్ద స్కెచే ఉందట..??

sekhar