ఏ మాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన చిన్నది అక్కినేని సమంత. తన అందచందాలతో, సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నది ఈ కుందనపు బొమ్మ. ఏమాయ చేశావే అనే తొలి సినిమాతో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది ఈ బ్యూటీ. కాగా పెళ్లైన తర్వాత కూడా తన క్రేజ్ ను ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాల్లో తన ప్రతిభను కనబరుస్తున్నారు ఈ బ్యూటీ. అయితే పెళ్లైన తర్వాత ఈ చిన్నది లేడి ఓరియెంటేడ్ సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ చిన్నది లాక్ డౌన్ నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది.
అయితే ఈ ముద్దుగుమ్మ లాక్ డౌన్ నుంచి తన ఫ్యామిలీతో సరదాగా గడిపిందని వార్తలు వచ్చాయి. అలాగే రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా సామ్ జామ్ అంటూ టాక్ షో ద్వారా హోస్ట్ గా కూడా మారింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ బ్యూటీ ఇటు సినిమాల్లోనూ నటిస్తూనే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సరీస్ లో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది ఈ కుందనపు బొమ్మ. ఇదిలా ఉంటే ఈ భామ తన అబ్బురపరిచే నటన ద్వారా తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతున్నారు.
అయితే తమిళ మంచి హిట్ కొట్టిన ‘96’ మూవీ తెలుగు రీమేక్ జాను మూవీ బాక్సాపీసును బద్దలు కొట్టలేపకోయింది. అయినా సమంత కొన్ని యాడ్స్ కు బ్రాండ్ అంబాసీడర్ గా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మడు. కాగా సామ్ జామ్ టాక్ షో ద్వారా కూడా ఈ కుందనపు బొమ్మ ఒక ఎపీసోడ్ కు భారీగానే వసూలు చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా పాల్గొంటు ఉంటారు.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. వామ్మో ఇదేంది ఇది ఇంత కష్టపడుతోంది అంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఏంటా ఫోటో అనుకుంటున్నారా.. జిమ్ లో ఈ బ్యూటీ వర్కౌట్ చేస్తూ రెండు చేతులలో పది పది కేజీలు బరువును మోస్తూ ఉన్న ఈ ఫోటో చూసి అభిమానులు ఫిట్ నెస్ కోసం మరీ ఇంతకష్ట పడాల వామ్మో అంటు కామెంట్లు చేస్తున్నారు. ఈమె చేస్తున్న వర్కౌట్లకు కొందరు ఆమెను అదరహో సమంత అంటు మెచ్చుకుంటున్నారు.